
నర్సీపట్నం, (జనస్వరం) : ఈరోజు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ రాజానా వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జనసేన నాయకులతో కలిసి ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని, మూడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన అధ్యయనం తర్వాత 1947 నవంబర్ 26 అప్పటి పార్లమెంట్ దీనిని ఆమోదిస్తే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, రాజ్యాంగంలోని పీటిక మరియు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలు అయితే మిగిలిన విభాగాలు రాజ్యాన్ని తీర్చిదిద్దడానికి కావలసిన మార్గాలని ఆనాడు అంబేద్కర్ గారు అన్నారని, శాసనాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచాలని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కల్పించడం ద్వారా ప్రజల సంక్షేమం పెంపొందించాలని, సంపద ఏ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని అందరికీ అందేటట్లు చూడడం, పని అందేటట్లు చూడటం, విద్య కు అవకాశం కల్పించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, మన దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగము అని అన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఉంటారు అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, ఉగ్గిన రమణ, కొత్తకోట రామ శేఖర్, పి.నాగు, అల్లు నరేష్, మాకి రెడ్డి వెంకటరమణ తదితురులు పాల్గొన్నారు.