Logo
Date of Publish : 26 November 2021, 4:36 pm
Editor : Sake Naresh

నర్సీపట్నం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

    నర్సీపట్నం, (జనస్వరం) : ఈరోజు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ రాజానా వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జనసేన నాయకులతో కలిసి ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని, మూడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన అధ్యయనం తర్వాత 1947 నవంబర్ 26 అప్పటి పార్లమెంట్ దీనిని ఆమోదిస్తే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని, రాజ్యాంగంలోని పీటిక మరియు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలు అయితే మిగిలిన విభాగాలు రాజ్యాన్ని తీర్చిదిద్దడానికి కావలసిన మార్గాలని ఆనాడు అంబేద్కర్ గారు అన్నారని, శాసనాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచాలని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కల్పించడం ద్వారా ప్రజల సంక్షేమం పెంపొందించాలని, సంపద ఏ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని అందరికీ అందేటట్లు చూడడం, పని అందేటట్లు చూడటం, విద్య కు అవకాశం కల్పించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, మన దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగము అని అన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఉంటారు అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, ఉగ్గిన రమణ, కొత్తకోట రామ శేఖర్, పి.నాగు, అల్లు నరేష్, మాకి రెడ్డి వెంకటరమణ తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com