
ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 29 వ వార్డ్ సుందరయ్య నగర్ లో నిర్వహించారు. ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఇటీవల కేతిరెడ్డి రోడ్డు వేయలేదని సుందరయ్య నగర్ కు చెందిన ఓ వృద్ధురాలు సాలమ్మ గారు సేవ్ ధర్మవరంలో కార్యక్రమంలో చిలకం మధుసూదన రెడ్డి దృష్టికి తెచ్చినందుకు ఆవిడ పెన్షన్ తీసివేయడం జరిగింది. తనకు పెన్షన్ వచ్చేదాకా ప్రతినెలా తనకు జనసేన పార్టీ తరపున నేనే పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈ నెల పెన్షన్ డబ్బులు రూ 3 వేల రూపాయలు ఇచ్చారు. అదే సుందరయ్య నగర్ కు చెందిన పుల్ల గోవింద్ గారు ఇటీవల నాయన పల్లి క్రాస్ దగ్గర యాక్సిడెంట్ కు గురవ్వడంతో వారి కుటుంబ సభ్యులకు 2 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.