Search
Close this search box.
Search
Close this search box.

వరద బాధితులకు బన్నీ వాసు సహాయం

      పాలకొల్లు, సెప్టెంబర్ 3 (జనస్వరం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శిడగం సురేంద్ర అధ్యక్షతన ముందుగా స్థానిక లైన్స్ కమ్యూనిటీ హాల్ నందు పట్టణ సిఐ కే రజనీకుమార్, ఎస్సై బాదం శీను ముఖ్య అతిధులుగా రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు పాలకొల్లు పట్టణంలో వందలాదిమంది జనసైనికులు అభిమానులు స్థానిక శ్రీనివాస డీలక్స్ సెంటర్ నుండి సుబ్బారాయుడు గుడి సెంటర్ యడ్ల బజార్ గజలక్ష్మి సెంటర్ పెద్ద గోపురం మీదుగా గాంధీ బొమ్మల సెంటర్ వరకు వందలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం గాంధీ బొమ్మల సెంటర్లో జనసేన రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్ గవర ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాసు )ముఖ్యఅతిథిగా కూటమి నాయకులుటీడీపీ నుండి పెచ్చెట్టి బాబు,గండేటి వెంకటేశ్వరరావు బిజెపి నుండి ఉన్నమట్ల కబడ్డీ, జక్కంపూడి కుమార్ జనసేన నుండి బోణం చినబాబు, తులా రామలింగేశ్వరరావు అతిధులుగా గాంధీ బొమ్మ సెంటర్లో కేక్ కటింగ్ నిర్వహించారు. సాయంత్రం రెల్లి వారి పేటలో రెల్లి సోదరులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో200 మంది మహిళలకు చీరల పంపిణీ 50 మంది విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల కిట్స్ పంపిణీ, అనంతరం పల్లపు వీధిలో జరిగినటువంటి పుట్టినరోజు వేడుకల్లో సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం బంగారు వారి చెర్వు గట్టులో 1000 మందికి అన్నదానం, 28 వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాలలో గవర ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ అక్టోబర్ 2 న గాంధీ మహాత్ముని పుట్టినరోజు అయితే సెప్టెంబర్ 2న మా జనసేన మహాత్ముని పుట్టినరోజు అని పాలకొల్లులో వందల మంది అభిమానులు శాంతియుతంగా క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ర్యాలీ నిర్వహించడమే కాకుండా రక్తదానం చేయడం అభినందనీయమని ప్రస్తుతం సంభవించిన కృష్ణాజిల్లా వరద బీభత్సానికి నష్టపోయిన వారికి మేము నిర్మించిన ఆయ్ చిత్రం సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన కలెక్షన్ల నుండి నిర్మాతలు భాగం నుండి 25% మొత్తాన్ని విరాళంగా మన జనసేన పార్టీ ద్వారా బాధితుల సహాయార్ధం అందజేస్తామని ప్రకటించారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి రెల్లి సోదరులు ఆయన పట్ల చూపే ప్రేమ ఎంతో విలువైనదని పాలకొల్లు నుండి జనసేన పార్టీ ద్వారా రెళ్లి సోదరులకు సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు.తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు పట్టణ అధ్యక్షుడు గండేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సంచలనమైన నిర్ణయంతో రాక్షస పాలనకి అంతమొందించామని దేశంలోనే రాజకీయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన శాఖల ద్వారా ఎంతో మార్పులకు శ్రీకారం చుట్టి గొప్ప పరిపాలన అందిస్తున్నారని అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కబర్ది,జక్కంపూడి కుమార్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీ నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి రాక్షస పాలనకు చరమగీతం పాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించారని ఒక రాష్ట్ర నాయకుడు పార్లమెంటులో కూర్చోవడం అరుదని అటువంటి ఖ్యాతి సంపాదించిన పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు తో కలిసి సుస్థిర పరిపాలన అందిస్తారని అన్నారు జనసేన నాయకులు తులా రామలింగేశ్వర రావు, మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి చేపట్టిన వెంటనే పంచాయితీలుకు నిధులు విడుదల చేయడం గొప్ప పరిణామమని అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ప్రజలు, నాయకులు, అధికారులు తో కలిపి గ్రామసభలు నిర్వహించి గ్రామానికి వచ్చే నిధులను అంశాలవారీగా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలో సభల ద్వారా నిర్ణయం తీసుకోవడం భారతదేశ చరిత్రలోనే గొప్ప పరిణామం ఈ విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ అభివృద్ధి పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి తెలియజేస్తుందని జనసైనికులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.జిల్లా నాయకులు బోణం చినబాబు మాట్లాడుతూ అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వను అన్న వారిని అదః పాతాలానికి తొక్కిన మా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం నెలకొల్పి నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి గ్రామాభివృద్ధికి మంచి మంచి నిర్ణయాలతో పరిపాలన కొనసాగిస్తున్నారని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమాలలో విన్నకోట గోపి, పినిశెట్టి శ్రీను, బిట్టా లక్ష్మీనారాయణ, కొమ్ముల దినేష్, ఆచంట చరణ్ దీపు, బొద్దాని శిరీష్, పోకల శివ,ధనాల మణి జనసేన జిల్లా, మండల, పట్టణ నాయకులు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way