రాజంపేట ( జనస్వరం ) : సరిగా విద్యుత్ సరఫరా లేక విద్యుత్ కోతల వలన తమ చదువుకు ఇబ్బంది కలుగుతుందని రాజంపేట పట్టణంలో అమ్మాయిల బీసీ హాస్టల్ లో తమ సమస్యని రాజంపేట నాయకులు బాలసాయికృష్ణ గారికి తెలిపారు. ఆయన రాజంపేట నియోజకవర్గం జనసేన నాయకుడు అతికారి కృష్ణ దృష్టికి తీసుకెళ్లగా బీసీ బాలికల వసతి గృహంలో రూపాయల ఇన్వర్టర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటం తప్ప బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు పేద విద్యార్థులకు చేసింది శూన్యమని అన్నారు. ఈ హాస్టల్లోని వసతులని, రాబోయే జనసేన- తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో విద్యార్థుల హాస్టల్ లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి విద్యార్థుల అభివృద్ధి కోసం తోడ్పడుతామని జనసేన నాయకుడు అతికారి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు కోలాటం హరికృష్ణ, నంద్యాల హరి, బండ్ల నాగరాజు, అబ్బిగారి గోపాల్, ముత్యాల చలపతి, పూల మురళి , వైశ్య యువజన సంఘం అధ్యక్షుడు రాజ శరత్ గారు పాల్గొన్నారు.