Logo
Date of Publish : 08 February 2024, 11:14 pm
Editor : Sake Naresh

బాలికల వసతి గృహంలో విద్యుత్ ఇన్వర్టర్ ఏర్పాటు చేసిన అతికారి కృష్ణ

    రాజంపేట ( జనస్వరం ) :  సరిగా విద్యుత్ సరఫరా లేక విద్యుత్ కోతల వలన తమ చదువుకు ఇబ్బంది కలుగుతుందని రాజంపేట పట్టణంలో అమ్మాయిల బీసీ హాస్టల్ లో తమ సమస్యని రాజంపేట నాయకులు బాలసాయికృష్ణ గారికి తెలిపారు. ఆయన రాజంపేట నియోజకవర్గం జనసేన నాయకుడు అతికారి కృష్ణ దృష్టికి తీసుకెళ్లగా బీసీ బాలికల వసతి గృహంలో రూపాయల ఇన్వర్టర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటం తప్ప బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు పేద విద్యార్థులకు చేసింది శూన్యమని అన్నారు.  ఈ హాస్టల్లోని వసతులని, రాబోయే జనసేన- తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో విద్యార్థుల హాస్టల్ లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి విద్యార్థుల అభివృద్ధి కోసం తోడ్పడుతామని జనసేన నాయకుడు అతికారి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు కోలాటం హరికృష్ణ, నంద్యాల హరి, బండ్ల నాగరాజు, అబ్బిగారి గోపాల్, ముత్యాల చలపతి, పూల మురళి , వైశ్య యువజన సంఘం అధ్యక్షుడు రాజ శరత్ గారు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com