చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పసుపులేటి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏపీ శివయ్య మాట్లాడుతూ జనసేన పార్టీని పూతల పుట్టు నియోజకవర్గంలో అత్యున్నత స్థానం తీసుకెళ్తామని పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఏపీ శివయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గం లోని అన్ని మండలాధ్యక్షులతో మరియు జన సైనికులు కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాను పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత చిత్తూరు జిల్లా అధ్యక్షులు పూల ప్రభాకర్ గారు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి ఎల్లవేళ అండగా ఉంటామని తెలిపారు.