Search
Close this search box.
Search
Close this search box.

జల వనరుల శాఖ మంత్రిగా అంబటి నీవు “అరసున్నా”

     అనంతపురం ( జనస్వరం ) : జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి మీరు రాష్ట్రానికి చేసింది …”సున్నా”, జల వనరుల శాఖ మంత్రిగా నీవు “అరసున్నా”, పోలవరం అభివృద్ధి… సున్నా?, రాష్ట్రంలో జల వనరుల ప్రాజెక్టుల అభివృద్ధి… సున్నా?, నీ నియోజకవర్గంలో అభివృద్ధి… “సున్నా” అంటూ జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ సున్నా సున్నా కలిసినా, హెచ్చించిన సున్నానే….. ఇలాంటి సచ్చు సన్నాసి “సున్నా” లెక్కచారాలు చెప్పడానికా? మీకు మంత్రి పదవి ఇచ్చింది. మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి మీ శాఖలో పురోగతి గురించి ఏనాడైనా రాష్ట్ర ప్రజలకు వివరించారా? వచ్చే ఎన్నికల తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు “సున్నా” అని తెలుసుకో. అమ్మ రోజా గారు మీరు నారా భువనేశ్వరి గారి లాంటి పెద్దల్ని చులకనగా హేయంగా నీచంగా… ఫ్యాషన్ షో చేయడానికి వెళుతున్నారు అని మాట్లాడడం తగదు. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆడవారిని మాట్లాడేది ఇలాగేనా? అంటూ గగోలు పెడతారు… మీరు మాత్రం సాటి స్త్రీల గురించి కించపరుస్తూ వ్యంగంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? మీరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి… నగరి నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పగలరా? మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పర్యాటక రంగం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పగలరా? అంటూ ధ్వజమెత్తారు.  అంబటి రాంబాబు గారు, రోజా గారు ఎవరు సున్నాలో రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికలలో తేల్చనున్నారు? ఇకనుంచి అయినా బాధ్యతగా మెలగండి? ప్రతిపక్షాల గురించి అవహేళనగా మాట్లాడి చరిత్ర హీనులు కాకండి అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way