Logo
Date of Publish : 25 October 2023, 9:38 pm
Editor : Sake Naresh

జల వనరుల శాఖ మంత్రిగా అంబటి నీవు “అరసున్నా”

     అనంతపురం ( జనస్వరం ) : జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి మీరు రాష్ట్రానికి చేసింది ..."సున్నా", జల వనరుల శాఖ మంత్రిగా నీవు "అరసున్నా", పోలవరం అభివృద్ధి... సున్నా?, రాష్ట్రంలో జల వనరుల ప్రాజెక్టుల అభివృద్ధి... సున్నా?, నీ నియోజకవర్గంలో అభివృద్ధి... "సున్నా" అంటూ జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ సున్నా సున్నా కలిసినా, హెచ్చించిన సున్నానే..... ఇలాంటి సచ్చు సన్నాసి "సున్నా" లెక్కచారాలు చెప్పడానికా? మీకు మంత్రి పదవి ఇచ్చింది. మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి మీ శాఖలో పురోగతి గురించి ఏనాడైనా రాష్ట్ర ప్రజలకు వివరించారా? వచ్చే ఎన్నికల తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు "సున్నా" అని తెలుసుకో. అమ్మ రోజా గారు మీరు నారా భువనేశ్వరి గారి లాంటి పెద్దల్ని చులకనగా హేయంగా నీచంగా... ఫ్యాషన్ షో చేయడానికి వెళుతున్నారు అని మాట్లాడడం తగదు. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆడవారిని మాట్లాడేది ఇలాగేనా? అంటూ గగోలు పెడతారు... మీరు మాత్రం సాటి స్త్రీల గురించి కించపరుస్తూ వ్యంగంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? మీరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి... నగరి నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పగలరా? మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పర్యాటక రంగం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పగలరా? అంటూ ధ్వజమెత్తారు.  అంబటి రాంబాబు గారు, రోజా గారు ఎవరు సున్నాలో రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికలలో తేల్చనున్నారు? ఇకనుంచి అయినా బాధ్యతగా మెలగండి? ప్రతిపక్షాల గురించి అవహేళనగా మాట్లాడి చరిత్ర హీనులు కాకండి అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com