ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనగానే గుర్తొచ్చేది బండరాళ్ల వంటి ప్రజల మనస్తత్వాలు, ఏడు దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల పల్లకీలు మోసి మోసి ఇక్కడి ప్రజల భుజాలు తాళలేకున్నాయి. ఎన్నిసార్లు మోసపోయినా కులం, మతం, డబ్బుకి బానిసలై వారి గుండెల నిండా అక్రమార్కులు అవినీతిపరులకు గుడులు కట్టి ఆరాధిస్తున్నారు. ఇపుడు ఇదే వారి పాలిట శాపంగా మారిందా అనిపిస్తుంది.. ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన కరువు ఆంధ్ర రాష్ట్రంలో రక్కసిలా విరుచుకుపడుతుంది.. రైతు దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వాల అండ కరువై వలసలు పోవటానికి సిద్ధపడుతున్నారు.. ఇంత జరుగతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థతి, ఖజానా ఖాళీ అనే కన్నా అప్పులలో ఉంది అనడం సబబేమో.. నాయకులకు దోచుకుని తిననీకే సరిపోని ఖజానా రైతులకు అండగా ఉంటుందనుకోవడం అత్యాశే అనుకోవాలి.. మూడు రాజధానులు కడతాం అని డాంబీకాలు పలికిన ప్రభుత్వం పేద రైతుల పట్ల చిన్న చూపు చూస్తోంది… మా సీమ బిడ్డ రాజన్న వారసుడు రాజన్న రాజ్యం తెస్తాడని ఆశించిన రైతులు ఇపుడు తమ కరువు తామే కొని తెచుకున్నామని ఉసూరుమంటున్నారు.. వేల కోట్ల వ్యవసాయ బడ్జెట్ ఎటుపోతుందో తెలీక మేధావులు సైతం నివ్వెరపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మాత్రం ఎప్పటిలానే తీవ్ర కరువులో ఉండటం శోచనీయం. దీనికి కారణం ప్రజల ఆలోచనా విధానం మరియు నాయకుల మోసపూరిత వాగ్ధానాలు అనే చెప్పాలి.
పచ్చటి నేలలో బంగారాన్ని పండిచే రైతన్న నేడు ఇలా ఏ నగరానికో వలస పోయి ఇటుకలు మోస్తూ, సున్నం కొడుతూ, నెత్తిన బుట్టనెత్తి పళ్ళు అమ్ముకుంటూ బతకాల్సిందేనా.. కొన్ని వేల మంది వలసలు పోతున్నా మిగిలిన ప్రజల ఆలోచనా విధానం మారదా.. పోనీ నేటి యువతరం అయినా మెలుకుంటుందా లేదా అదే కులం, మతం, ప్రాంతం అనే స్వార్థంతో రాష్ట్ర అభివృద్ధిని మరింత వెనక్కి నెట్టుకుంటుందా… అనేది కాలమే సమాధానం చెప్పాలి… ఏది ఏమైనా అందరికీ అన్నం పెట్టే రైతన్నకు ఈ దుస్థితి పట్టడం అపశకునమనే చెప్పాలి.
రాయలసీమ నుంచి నాయకులు ఎదిగారే తప్ప, ప్రజల భవిష్యత్తు కాదు. ప్రాంత అభివృద్ధి ఏమాత్రం కాదు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఒరిస్సాకు పెరిగాయే తప్ప, నాయకుల వంశపారపర్యం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ప్రాంతాలు వెనకబడలేదు. ఆ ప్రాంత నాయకులు వెనక్కి నెట్టేశారు.
Written By
@Battingbaba360d ( Twitter )