కార్వేటి నగరం, (జనస్వరం) : కార్వేటినగరం మండల కేంద్రంలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల అధికార ప్రతినిధి పొన్న శోభన్ బాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలకి కరోనా వస్తే ఆ ఇంటి చూట్టూ రెడ్ రిబ్బన్లు కట్టి, బ్లీచింగ్ చల్లి, దండోరా వేయించి వారిని భయభ్రాంతులకు గురిచేసి, చావాలా? బ్రతకాలా అనే సంశయంలోకి అధికారులు నెట్టేస్తున్నారు. స్థానిక అధికారులు మరి విడ్డూరంగా వ్యవహరిస్తు వుంటారు. అదే అధికార పార్టీ నాయకులకి కరోనా వస్తే సలాం కొట్టి సంచారం చేయమంటారు. విచ్చల విడిగా తిరుగుతారు. కరోనా కి కారకులౌతారు. ఇదేనా సమన్యాయ పాలన అంటే ? సామాన్య ప్రజలకు ఒక న్యాయం, అధికార పార్టీ నాయకులకి మరొక న్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా మీ అధికారాలను గుర్తించి ప్రజలకి ఉపయోగపడే విధంగా పరిపాలన చేయాలని హితవు పలికారు. ఎవరికి కరోనా వచ్చినా రాజకీయాలను పక్కనపెట్టి పని చేయాలని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భానుచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఇన్ ప్రెంట్ ఆప్ క్రోకోడైల్ పెస్టివల్ అతి త్వరలోనే ఉందని జనసేన పార్టీ తన, మన భేదాభిప్రాయలు చూడద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రాఘవ మాట్లాడుతూ అందరు సమానులే అనే భావన ప్రజలలో కలిగేటట్లు, అధికారుల తీరు ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేష్, సోమ్ శేఖర్ తదితురులు పాల్గొన్నారు.