
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అన్నదాతలు పండించిన వరి ధాన్యం అకాల వర్షంకు నీటమునిగి లబో దిబో మంటున్నారు అని మైలవరం జనసేన ఇంచార్జ్ అక్కల రామ మోహన రావు (గాంధి) గారు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులు నుండి రబి సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయటం ఆలస్యం అవటం వలన ఈరోజు రైతులు రాష్టం అంతటా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా మైలవరం నాగులూరు రెడ్డి గూడెం కూనపరాజు పర్వ. యార్డ్ జి. కొండూరు కొండపల్లి గుంటుపల్లి గొల్లపూడిలో ధాన్యం తడిసి అమ్మకానికి పనికి రాకుండా పోయింది. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. మిల్లర్లు దోపిడీ నుండి రైతులను కాపాడాలని, అలాగే రైతులకు గిట్టు బాటు ధర ఇప్పించాలి. దీనిపై స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు రైతులకు సమాధానం చేప్పాలని అక్కల గాంధీ గారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here