● అమ్మఒడి పేరుతో డబ్బులు వేస్తున్న సీఎం జగన్ నెలనెలా వందకు పదిహేను రూపాయల లెక్కన వడ్డీ వసూలు చేస్తున్నారు
● ఆరో రోజు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి దగ్గర వైసీపీ ప్రభుత్వ మోసాలపై ఎంతో చైతన్యంతో మాట్లాడిన మహిళలు
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట ఆరో రోజున కిసాన్ నగర్ ప్రాంతంలోని సింహపురి కాలనీలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి ఎదుట స్థానికులు అనేక సమస్యలను తెల్పుతూ వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కిసాన్ నగర్ సింహపురి కాలనిలో మహిళలు వైసీపీ ప్రభుత్వ మోసాలను తెలుసుకోవడంలో ఎంతో చైతన్యంతో ఉన్నారని తెలిపారు. అమ్మఒడి పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయలు వేస్తానన్న సీఎం జగన్ మొదటి ఏడాది వేశారని, రెండో ఏడాది వేయలేదని, ఇప్పుడు మూడో ఏడాదిన పదిహేను వేలు కాదు పన్నెండు నుండి పదమూడు వేల రూపాయలు వేస్తాం అని అంటున్నారని, దానికి కూడా అనేక మందిని కుంటి సాకులు చూపి పథకం నుండి తొలగించారని వాపోయారన్నారు. అసలు ఈ అమ్మఒడి అనే పథకం చాలా మోసపూరితంగా ఉందని, ఎవరైనా డబ్బులు అప్పు ఇస్తే మనకు నెలకు వందకి రెండు నుండి మూడు రూపాయల వడ్డీ పడుతుందని, కానీ సీఎం జగన్ డబ్బులు వేసి ప్రతి నెలా చెత్త పన్ను, పెరిగిన కరెంట్ ఛార్జీలు, నిత్యావసర ధరలతో వడ్డీ వసూలు చేస్తున్నారని మహిళలు తెలిపారన్నారు. ప్రతి కుటుంబం సగటున నెలకు రెండు వేల రూపాయలకు పైగా భారాన్ని భరిస్తోందని, ఈ లెక్కన చూస్తే సీఎం జగన్ అమ్మ ఒడి డబ్బులపై నెలకు వందకి పదిహేను రూపాయల వడ్డీ పొందుతున్నారని మహిళలు తెలిపారన్నారు. బటన్ నొక్కి ఉచితంగా డబ్బులు పంచుతున్నాం అని ప్రచారం చేసుకుంటూ మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరుపై మహిళల్లో ఇంత చైతన్యం తనకు ఆశ్చర్యం కల్గించిందని చెప్తూ కేతంరెడ్డి వారిని అభినందించారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కి ఓటువేశారని, నెల్లూరు సిటీ మాత్రం అభివృద్ధి కాలేదు కానీ అనిల్ మాత్రం 500 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నాడని, వైసీపీకి ఓటు వేసే పొరపాటు మరోసారి చేయొద్దని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.