Search
Close this search box.
Search
Close this search box.

కోనసీమలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు కోసం అమలాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు గారు చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులు

కోనసీమ

              కోనసీమ ప్రాంతంలో వేలకోట్ల చమురు నిక్షేపాలు తరలించుకుపోతున్నONGC, GAIL, Carin energy కంపెనీలు కనీస భాధ్యతగా కోనసీమలోని 14 మండల కేంద్రాలలో ఆక్సీజన్ ప్లాంట్స్ పెట్టాలని ఈ ప్రాంత అభివృద్ధికి CSR ఫండ్స్ ఉపయోగించాలని ప్రధానమైన డిమాండ్ తో అమలాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ మరియు గోదావరి పార్లమెంటరీ సంయుక్త కమిటీ జాయింట్ కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు దీక్ష తలపెట్టారు.  ఈ దీక్షను పోలీసులు భగ్నం చేసి హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నుండి పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఇంటివద్ద హౌస్ అరెస్ట్ చేయడం వంటి పరిణామాల మధ్యన ఇంటివద్దనే దీక్షకు కూర్చోవడం జరిగింది. చమురు సంస్థల మెడలు వంచి ఈ ప్రాంతానికి న్యాయం చేయవలసిన రాజకీయ నాయకులు పోలీసులుపై వత్తిడి తెచ్చి కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని మన ప్రాంతానికి ఆక్సీజన్ ప్లాంట్ సాధించి కోనసీమ అభివృద్ధి చెందే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. చమురు సంస్థలకు కాపలా దారులుగా ఉన్న ప్రజాప్రతినిధుల వ్యవహారం చూస్తుంటే చమురు సంస్థలతో వీరికి లోపాయకారి ఒప్పందాలు ఉన్నట్లు అవగతం అవుతుంది. ఆక్సీజన్ ప్లాంట్స్ వల్ల కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనే కాక భవిష్యత్లో కూడా ఈ ప్రాంతానికి అవసరం ఉంటుంది. ఈ మాత్రం కనీస పరిజ్ఞానం ప్రజాప్రతినిధులకు ఎందుకు లేదు? ఈ సంస్థల నిర్వహకం వల్ల గతంలో ఎన్నో ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అదే విధంగా వీరి భారీ వాహనాల వల్ల ఎంతో మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఇంత తెలిసి ఈ సంస్థలపై ఈ ప్రాంత అభివృద్ధికి వత్తిడి తేకపోవడం ప్రజా ప్రతినిధులది ముమ్మాటికీ తప్పే. జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆక్సీజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, కోనసీమ అభివృద్ధికి CSR ఫండ్స్ పూర్తిస్థాయిలో ఉపయోగించాలని అనే డిమాండ్ తో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అని రాజబాబు గారు అన్నారు.

 

ఇవి కూడా చదవండి :

హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

 

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way