కోనసీమ ప్రాంతంలో వేలకోట్ల చమురు నిక్షేపాలు తరలించుకుపోతున్నONGC, GAIL, Carin energy కంపెనీలు కనీస భాధ్యతగా కోనసీమలోని 14 మండల కేంద్రాలలో ఆక్సీజన్ ప్లాంట్స్ పెట్టాలని ఈ ప్రాంత అభివృద్ధికి CSR ఫండ్స్ ఉపయోగించాలని ప్రధానమైన డిమాండ్ తో అమలాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ మరియు గోదావరి పార్లమెంటరీ సంయుక్త కమిటీ జాయింట్ కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు దీక్ష తలపెట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేసి హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నుండి పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఇంటివద్ద హౌస్ అరెస్ట్ చేయడం వంటి పరిణామాల మధ్యన ఇంటివద్దనే దీక్షకు కూర్చోవడం జరిగింది. చమురు సంస్థల మెడలు వంచి ఈ ప్రాంతానికి న్యాయం చేయవలసిన రాజకీయ నాయకులు పోలీసులుపై వత్తిడి తెచ్చి కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని మన ప్రాంతానికి ఆక్సీజన్ ప్లాంట్ సాధించి కోనసీమ అభివృద్ధి చెందే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. చమురు సంస్థలకు కాపలా దారులుగా ఉన్న ప్రజాప్రతినిధుల వ్యవహారం చూస్తుంటే చమురు సంస్థలతో వీరికి లోపాయకారి ఒప్పందాలు ఉన్నట్లు అవగతం అవుతుంది. ఆక్సీజన్ ప్లాంట్స్ వల్ల కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనే కాక భవిష్యత్లో కూడా ఈ ప్రాంతానికి అవసరం ఉంటుంది. ఈ మాత్రం కనీస పరిజ్ఞానం ప్రజాప్రతినిధులకు ఎందుకు లేదు? ఈ సంస్థల నిర్వహకం వల్ల గతంలో ఎన్నో ప్రాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అదే విధంగా వీరి భారీ వాహనాల వల్ల ఎంతో మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఇంత తెలిసి ఈ సంస్థలపై ఈ ప్రాంత అభివృద్ధికి వత్తిడి తేకపోవడం ప్రజా ప్రతినిధులది ముమ్మాటికీ తప్పే. జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆక్సీజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, కోనసీమ అభివృద్ధికి CSR ఫండ్స్ పూర్తిస్థాయిలో ఉపయోగించాలని అనే డిమాండ్ తో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అని రాజబాబు గారు అన్నారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com