Search
Close this search box.
Search
Close this search box.

వ్యవసాయం – గ్రామీణ ఉపాధి హామీ పథకం కు అనుసంధానం – ప్రకృతి వ్యవసాయం

వ్యవసాయం – గ్రామీణ ఉపాధి హామీ పథకం కు అనుసంధానం – ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ)

వ్యవసాయం :

                భారతదేశంలో వ్యవసాయం చేసే రైతులు 45% పైన ఉన్నారు. ప్రపంచంలో 12% వ్యవసాయ భూమి భారతదేశంలోనే ఉంది.  కానీ ప్రపంచ మార్కెట్లో భారత్ కేవలం 30% మాత్రమే. అయితే దేశానికి వెన్నుముక అని నానుడి చాటిచెప్పే నాయకులు, పత్రికలు, మీడియా, చివరకు రైతుకు మద్దతుగా నిలవక  రైతు వెన్నెముక విరుస్తున్న ప్రభుత్వాలు. వ్యవసాయం యొక్క చరిత్ర పరిశీలిస్తే ఆదిమానవుడు వేటాడటం ద్వారా ఆహారాన్ని  సముపార్జన చేసుకునే స్థితి నుంచి నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నాడు.  పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పు దినుసులు, మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు  క్రీస్తుపూర్వం 7000 లోని మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి.  క్రీస్తు పూర్వం 3000 నాటికి ఈజిప్టియన్లు, మెసపటోమియన్లు పెద్దఎత్తున వ్యవసాయ పద్ధతులు, ఎరువులు వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు. కానీ సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి కీలకాంశం. భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్దతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకత పెంచే నిమిత్తం మూడో ప్రణాళిక కాలం నుంచి చర్యలు చేపట్టినా స్వయం సమృద్ది సాధించడం లో ఇంకా వెనుకబడే ఉన్నాం.

 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కు అనుసంధానం : 

                 ముఖ్యంగా వ్యవసాయంలో  దుక్కి దున్నడానికి, రసాయన ఎరువులకు, కలుపు తీయడానికి, గట్లు ఎత్తడానికి, మొక్కలు నాటడానికి, చివరికి పంట చేతికి వచ్చిన వరకు కూలీలు అవసరం.  దీంతో రైతులు పంట నుంచి వచ్చే ఆదాయం కంటే చివరికి అప్పులు చేసి పరిస్థితి.  కాబట్టి గ్రామీణ ఉపాధి హామీ పథకం కు వీటిని అనుసంధానం చేయాలి దీనివల్ల రైతు బ్యాంకులకు అప్పులు అయి సగటున  రోజుకు 42 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను అప్పుడు బారిన పడకుండా రక్షించవచ్చు దీని ద్వారా వలసలు నివారించి సుస్థిర జీవనోపాధి కల్పించవచ్చు. గ్రామీణ స్థాయిలో ప్రతి పంచాయతీకి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి ఉచితంగా రైతు పంటను నిల్వ చేసినట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రైతులు దగ్గర పంటను ప్రభుత్వం గ్రామాలకు వచ్చి కొని రైతుకు పంట డబ్బును ఒక వారం రోజుల్లో చెల్లించగలగాలి.  అలా చేయక ఒక నెల, రెండు నెలలు గడువు పెట్టితే, రైతులు ప్రభుత్వానికి పంటను ఇవ్వక డబ్బు అవసరం నిమిత్తం మధ్య దళారులకు ఇవ్వడం వలన తక్కువ డబ్బుకు పంట కొనడం వలన రైతు నష్టపోతున్నాడు. అలాగే ప్రతి రైతుకు ప్రభుత్వ వ్యవసాయ యంత్రాలు యంత్రపరికరాలు 80% రాయితీతో ఇవ్వాలి. ప్రతి ఎకరా దాటిన రైతులకు ఉచిత బోర్లు వేయాలి. మహారాష్ట్రలో, ఢిల్లీలో రైతులు రోడ్ల మీదకు వచ్చి మహాపాదయాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది.  రైతు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది అంటే దేశంలో రైతుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

                    వ్యవసాయంపై అవగాహన స్నేహితులకు కల్పించే దృష్ట్యా ప్రతి గ్రామానికి ఒక వ్యవసాయ అధికారిని నియమించి మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా మన పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. రైతుల మధ్య సమన్వయం కోసం, వారు చర్చించుకోవడం కోసం ప్రతి పల్లెకు రైతు వేదిక నిర్మించాలి. పంట నూర్పిళ్ళు కోసం రైతు కళ్లాలో లేదా ప్రభుత్వ భూమిలో ఉచిత కళ్ళాలు నిర్మించాలి. అవినీతి బెడద నుండి రైతును విముక్తి కలిగించే విధంగా వారికి భూమి హక్కు స్పష్టంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం తేవాలి.  రైతులకు ఉచిత విద్యుత్ కనీసం 16 గంటలు అయినా ఇవ్వాలి. నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో LCD వేసి రైతులకు పంటలపై, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి. పత్రికలలో ప్రతిరోజు ఒక పేజీ కేటాయించాలి. టీవీలో అవగాహన  కల్పించే చర్చ జరగాలి. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మొక్కజొన్న సాగు  ఎక్కువగా జరుగుతుంది. మొక్కజొన్న కోళ్ల దానాకు ఉపయోగిస్తున్నారు. దేశంలో 2కోట్ల 4 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు.  కానీ ఇప్పుడు వర్షాలు కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఎండబెట్టే సమయంలో మొక్కజొన్న వర్షంకు తడవడంతో ఆ గింజలు నాని మొక్కలు మొలకెత్తి పంట పాడైపోయే పరిస్థితి. కావున ప్రభుత్వం వీరికి పరిహారం కల్పించి రైతులను ఆదుకోవాలి. పిల్ల కాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీరు అందించి పంట భూమి పరిమాణం పెంచాలి.

                      వ్యవసాయ రంగంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ ప్రత్యేక కోర్సులు ఉన్నట్లుగానే ఇంటర్మీడియట్ నుంచే ఒక పాఠ్యాంశంగా వ్యవసాయం గురించి ఒక పాఠం పెట్టి విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలి. అలాగే పాఠ్యపుస్తకాలలో ఇంటర్ నుంచే ఒక పాఠంగా పెట్టి చట్టాలు, రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించి భయం పోగొట్టాలి.  వ్యవసాయ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలి. విద్యార్థులకు భూమి పరీక్ష ప్రయోగశాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోనే భూపరీక్షలు చేయాలి.

 ప్రకృతి వ్యవసాయం(సేంద్రియ వ్యవసాయం) : 

           ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువుతో చేసేది ప్రకృతి వ్యవసాయం. భారతదేశంలో క్రీస్తు పూర్వం నుండి బ్రిటిష్ పాలన వరకు వ్యవసాయం ప్రకృతి గానే  జరిగేది. స్వాతంత్రం వచ్చిన తరువాత విదేశీ కంపెనీలు తమ కృత్రిమ ఎరువులు భారత్ లో విక్రయించడంతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయని భ్రమ కలిపించడంతో ఎరువులు ఎంచుకుని చివరికి పంట దిగుబడులు పెరగక 1970వ శకం నుండి రసాయన ఎరువులు ధరలు విపరీతంగా పెరిగి, అప్పులు తీర్చలేని పరిస్థితులకు రైతులు చేరుకున్నారు. దుక్కి దున్నాలన్నా, ఎద్దులు కొనాలన్నా, ట్రాక్టర్ దుక్కి అయినా, బ్యాంకు రసాయన ఎరువుల కోసం  అప్పు కట్టలేని పరిస్థితితో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంటలు విషతుల్యమై ఆరోగ్యంపై ప్రభావం, భూ సారాన్ని కోల్పోవడం వంటి పరిణామాలు చివరకి రైతులు తమ పిల్లల్ని వ్యవసాయం కాకుండా ఉద్యోగం, వ్యాపారం వైపు మళ్ళేలా చేయడం జరుగుతుంది.  అంతేకాకుండా వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ చేయడం వలన  దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు తగ్గిపోయి ఆహార ఉత్పత్తి కొరత ఏర్పడి కూరగాయలు- ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ భయంకరమైన కారణాలే  రైతులను తిరిగి పూర్వ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా చేశాయి.

 భారతదేశంలో ఆచరిస్తూ వ్యవసాయంలో మూడు పద్ధతులు ముసనోబు పుమ్ఓకా(జపాన్), హ్యన్ క్యూబో(కొరియా), పాలేకర్ పద్ధతి.

                   భారత దేశంలో పాలేకర్ పద్ధతి అతి ముఖ్యమైనది. ఈ వ్యవసాయం రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయం సేంద్రియ వ్యవసాయం. దీన్ని పవన్ కళ్యాణ్ లాంటి జనాదరణ ఉన్న వ్యక్తి  ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమాలు చేసి ప్రోత్సహించండి శుభపరిమాణం. ఇలా ప్రముఖులు దీనిపై అవగాహన కల్పించి ప్రభుత్వం, పత్రికలు, మీడియా రైతును ప్రోత్సహించాలి. కొందరు ఉద్యోగులు బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో ఉన్నత ఉద్యోగాలు చేసిన వారు సైతం తమ ఉద్యోగాలు సెలవులు ఉన్న సమయంలో సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టి లక్షలు సంపాదించిన వారు కూడా ఉన్నారు. వ్యవసాయం చేస్తే అమ్మాయిని ఇవ్వం అని ఆలోచించే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచన మార్చుకునే రోజు రావచ్చు.

సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలు :
                   సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలు, పలు లేదా బహు పంటలు మరియు అంతర పంటలు తప్పని సరిగా సాగు చేయవలెను . వివిధ పంట మొక్కలు భూమిలోని వేర్వేరు లోతుల నుండి వాటికి కావలెను పోషక పదార్ధాలను గ్రహిస్తాయి. కొన్ని పంటలు కలిపి మిశ్రమ పంటలుగా సాగు చేస్తే పంటలు బాగా పండుతాయి.కొన్ని పంటలు కలిపి వేస్తే పంట నష్టం వస్తుంది . కాబట్టి రెండు లేదా అంతకన్నా ఎక్కువ రకాల పంటలను వాటి అవసరాలను బట్టి సాగు చేయవచ్చును. అంతేగాక మిశ్రమ మరియు పలు పంటలను సాగు చేయడం వలన పురుగులు తాకిడిని తగ్గించవచ్చును. నేలను ఆరోగ్యంగా ఉంచుటలో మరియు సూక్ష్మజీవులు సహజ సిద్ధంగా పనిచేయడంలో పంట మార్పిడి ప్రముఖ పాత్ర వహిస్తుంది. వివిధ రకాల పంట మార్పిడి పద్ధతులను ప్రాంతాలవారీగా చాలా కాలం ముందే నిర్ణయించారు. నేలను ఆరోగ్యంగా ఉంచుటలో మరియు సూక్ష్మజీవులు సహజ సిద్ధంగా పనిచేయుటలో పంట మార్పిడి ప్రముఖ పాత్ర వహిస్తుంది. వివిధ రకాల పంట మార్పిడి పద్ధతులను ప్రాంతాలవారీగా చేయవలెను. నేల భౌతిక స్వభావం, నేల సార౦ వృద్ది చె౦దుతు౦ది. నేలలో సుక్ష్మజీవుల వృద్దికి, తద్వారా మొక్కలకు అవసరమైన పోషకాల లభ్యతకు ఉపయోగపడి ప౦టల అధిక దిగుబడి దోహద౦చేస్తు౦ది. నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకొనే సామర్ధ్యమును నేలకు ఆపాది౦చుతు౦ది. ఆహారపు అడవుల పద్ధతిలో భూమి లేనివారు, గ్రామీణ నిరుద్యోగులూ సమిష్టిగా ఖాళీగా ఉన్న భూములను కొద్దికాలం పాటు కౌలుకి తీసుకుని ఆ జీవావరణానికనువైన బహుళ ఉపయోగాలున్న అనేక రకాల చెట్లను నాటుతారు – అంటే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఆహారం, వంట చెరకు, పశుగ్రాసంతో పాటు ఫర్నీచర్ తయారీకి అవసరమైన కలపను కూడా కాలానుగుణంగా అందించ గలిగే విధంగా సరైన చెట్లనూ, పొదలనూ, తీగలనూ, గడ్డి జాతులనూ, దుంపలనూ తగినట్టుగా ఎంచుకోవడం. వైపరీత్యాల సందర్భంలో సంభవించే విషమ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఈ పద్ధతి విజయం సాధించవచ్చు.

రైతు గురించి గుంటూరు శేషేంద్ర శర్మ వ్రాసిన కవిత:

నేను డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు

భూములు ఎందుకు దున్నుతున్నానో  తెలియదు

నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్న, వేలు కాళ్ళై నడిచే చెట్టు మనిషి

 చెట్టు గా ఉంటే ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది

 మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను

by

బోడసింగి రామక్రిష్ణ

ట్విట్టర్ : @bodasingirk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way