
తిరుపతి ( జనశ్వర౦ ) : తిరుపతి 15వ వార్డు నందు ఇంచార్జి కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి సమక్షంలో సుమారు 50 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బిసి యువత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో యువత జనసేన పార్టీ వైపే మొగ్గు చూపుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ పార్టీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ప్రజలు విసుగు చెందన్నారు. జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కల్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ యాదవ్, హేమకుమార్, బాబ్జి, వీర మహిళలు వనజ, కీర్తన, లత, బలరాం, రమేష్, సుమన్, శేష, అరుణ్,శే షు, నిరంజన్, పృధ్వీ, మునుస్వామి, జనసైనికులు మనోజ్, రాజేంద్ర, బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం, రాజేష్, వీరమహిళలు, జిల్లా నాయకులు, జనసైనికులు అతిథులు పాల్గొన్నారు.