కడియం, (జనస్వరం) : ఇంటి స్థలాల కోసం కేటాయించిన భూమిని చదును పేరుతో దాదాపు 20 అడుగుల లోతు చెరువుగా మార్చేశారని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. జనసేన పార్టీ వైస్ ఎంపీపీ పంతం గణపతితో కలిసి వేమగిరిలోని 204/1 సర్వే నంబరులో మట్టి తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.కోట్ల విలువచేసే గ్రావెల్ తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు వైకాపా నాయకులు గండికొట్టారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలంటే 15 నుంచి 20 అడుగుల మేర పునాది నిర్మించాల్సి వస్తుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కారకులైన వారి నుంచి నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. పుల్లా రామారావు, బోడపాటి రాజేశ్వరి, అమీనాబేగం, జంగా వినోద్, అల్లంపల్లి ప్రసాద్, శేఖర్‌లక్ష్మణ్ మరియు తదితురులు పాల్గొన్నారు.