
బొల్లారం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా పటాన్చెరువు పార్టీ ఇంచార్జ్ యడమ రాజేష్ గారి నాయకత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా పటాన్ చెరువు నియోజకవర్గంలో బొల్లారం మున్సిపాలిటీలో హనుమాన్ టెంపుల్ నుంచి జ్యోతి థియేటర్ వరకు పాదయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలందరి వద్దకు తీసుకువెళ్లడం తెలంగాణ అసెంబ్లీలో జనసేన గొంతు వినిపించే విధంగా నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా జనవాని కార్యక్రమం నిర్వహించి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కదులుతూ రాజకీయ వ్యవస్థలో మార్పు దిశగా అడుగులు వేస్తుందని ఇంచార్జ్ రాజేష్ ఎడమ గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు మరియు మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.