Search
Close this search box.
Search
Close this search box.

ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు ఆర్థిక సహాయం అందించాలి.

ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు ఆర్థిక సహాయం అందించాలి.

ఈ కరోనా విపత్కర సమయంలో స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకున్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇపుడు వారి జీవిత గమనం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ లాక్ డౌన్ సమయంలో వివాహాది శుభకార్యములు ఉన్న మంచి రోజులు అయిపోయాయి. ఫోటో, వీడియోగ్రఫి వృత్తిని ఎంచుకున్న వారికి డబ్బులు సంపాదించుకునే రోజుల్లోనే షాపులు మూతపడ్డాయి. ఈ పరిణామంతో తాము ఆదాయం చేకూర్చుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఏపీ ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విపత్కర పరిస్థితిలో 25 మంది చనిపోయారని, అందులో కొందరు ఆత్మహత్య చేసుకొంటే మరికొందరు మానసిక ఒత్తిడికి గురయ్యి గుండెపోటుతో చనిపోయారని అసోసియేషన్ సభ్యులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.
ఈ కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఈ రంగంలో ఉన్న వారికి ఆరోగ్య భీమా, హెల్త్ కార్డులు అందించడంతో పాటుగా ఋణ అదుపాయం కల్పిస్తే స్వయం ఉపాధితో జీవిస్తున్న వారికి భవిష్యత్తు పైన ఆశలు కలుగుతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఒంగోలు
ఒంగోలులో విస్కృతంగా జనచైతన్య యాత్ర కార్యక్రమం
యువశక్తి
యువశక్తి రేపటి తరానికి ఆశాజ్యోతి : గజపతినగరం జనసేన నాయకులు
71397339671665665484
జగన్ రెడ్డి ఎలాంటివాడో నాడు శాసనసభ సాక్షిగా చెప్పిందే ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రులు!
IMG-20220826-WA0008
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు కవులకు అభినందనలు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
20220806_220327
ప్రభుత్వ దాష్టీకాల మీద ధైర్యంగా మహిళలు ముందుండి పోరాడాలి - జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way