ఈ కరోనా విపత్కర సమయంలో స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకున్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇపుడు వారి జీవిత గమనం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ లాక్ డౌన్ సమయంలో వివాహాది శుభకార్యములు ఉన్న మంచి రోజులు అయిపోయాయి. ఫోటో, వీడియోగ్రఫి వృత్తిని ఎంచుకున్న వారికి డబ్బులు సంపాదించుకునే రోజుల్లోనే షాపులు మూతపడ్డాయి. ఈ పరిణామంతో తాము ఆదాయం చేకూర్చుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఏపీ ఫోటోగ్రఫి, వీడియోగ్రఫి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విపత్కర పరిస్థితిలో 25 మంది చనిపోయారని, అందులో కొందరు ఆత్మహత్య చేసుకొంటే మరికొందరు మానసిక ఒత్తిడికి గురయ్యి గుండెపోటుతో చనిపోయారని అసోసియేషన్ సభ్యులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.
ఈ కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఈ రంగంలో ఉన్న వారికి ఆరోగ్య భీమా, హెల్త్ కార్డులు అందించడంతో పాటుగా ఋణ అదుపాయం కల్పిస్తే స్వయం ఉపాధితో జీవిస్తున్న వారికి భవిష్యత్తు పైన ఆశలు కలుగుతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com