
విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ పాలిటెక్నిక్ కాలేజీ మరియు విశాఖ ఐటిఐ కాలేజీ భూములను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తనకా పెట్టడాన్ని నిరసిస్తూ పోరా పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులు, జనసేన నాయకులు ధర్నాకు దిగారు. ఈ కళాశాల ఎంతోమంది పేద దిగువ మధ్యతరగతి విద్యార్థుల తలరాతను మార్చే అని ప్రభుత్వ రంగాల్లో మరియు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఇందులో చదువుకున్న విద్యార్థులు ఉన్నారని అన్నారు. అంతటి చరిత్ర కలిగిన ఈ కళాశాలను తనఖా పెట్టడం అంటే రాబోయే తరాల భవిష్యత్ ని చీకట్లోకి నెట్టడం అని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ రెండు కళాశాల భూములు తనకా నుంచి తప్పించాలని లేనిపక్షంలో మా ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల ముప్పిన ధర్మేంద్ర, నవీన్, భార్గవ్ సాయి, యశ్వంత్, రామకృష్ణ, వాసుదేవ్, సోమేశ్, దుర్గ నాయుడు, గౌతమ్, సతీష్, శివ, మహేష్, సత్తిబాబు, పొంగ రాజు, వర్మ తదితరులు పాల్గొన్నారు.