బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇద్దరు దివ్యాంగులు ఒక దివ్యాంగులు ఒక మంచి వారు పెళ్లి చేసుకున్నట్లయితే, పెళ్లి కానుక ఒకటిన్నర లక్ష ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు ముందుగానే ఆన్లైన్ లో అప్లై చేసుకునే అని చెప్పి ఉన్నారు ఇంతవరకు కూడా ఆన్లైన్ ఓపెన్ కాలేదు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఈ ఒక హామీలు నెరవేర్చలేదు. వెంటనే దివ్యాంగులకు పెళ్లి కానుక ఇవ్వాలని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగుల నాయకులు కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు తదితురులు పాల్గొన్నారు.