
శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలం చిన్నదిమిలి గ్రామ యువత, కొత్తురు నుండి బత్తిలి రహదారి మార్గం గోతులు గా ఉండటం వల్ల జనసేన అధ్యక్షులు పిలుపు మేరకు తమ సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ రహదారి గుంతలు, గుంతలుగా ఏర్పడి అక్కడి ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధికారులకు, నాయకులకు, ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు అని అన్నారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా సొంత నిధులతో రోడ్లుకు మరమ్మతులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు మరియు చిన్నదిమిలి గ్రామ యువత తదితురులు పాల్గొన్నారు.