
తెలంగాణ ( జనస్వరం ) : కూకట్ పల్లి నియోజకవర్గంలోని నాళాలలో వివిధ రకమైన కెమికల్స్ మరియు వ్యర్థాలు కలుస్తున్నాయి. వాటి వల్ల అక్కడ ఉండే ప్రజలు తీవ్ర అనారోగ్యంకి గురువుతున్నారని జనసేన పార్టీ నాయకులకి సమాచారం అందింది. అందులో భాగంగా శ్రీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఆ డివిజన్ లో నాళాలు దగ్గరికి వెళ్లి పరిస్థితిని గమనించి త్వరలో వీటికి సంబంధించిన అధికారులకి సమాచారం అందించి ఆ సమస్యకు పరిష్కరిస్తాం అని అక్కడ ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజల కష్టాల తరుపున పోరాడుతుందని చెప్పారు. అలాగే భవిష్యత్తులో పార్టీ బలోపేతం దిశగా పని చేస్తామని, అందుకు త్వరలోనే కార్యచారణ రూపొందిస్తున్నామని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, సూర్య, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.