
ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాల భాగంగా 11వ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం మంచాలపల్లిలో ఒక వికలాంగునికి జనసేన పార్టీ కువైట్ సభ్యులు రవి గారి సహకారంతో జిల్లా కార్యదర్శి పవన్ గారి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు అనంతసాగరం మండల కన్వీనర్ మస్తాన్, జిల్లా నాయకులు చిన్నా మరియు జనసైనికులు మహిళలు పాల్గొనడం జరిగింది.