సుప్రీమ్ కోర్టు రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరగలేదని తీర్చు ఇచ్చిందంటే ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉందని జనసేన నేత జయరామి రెడ్డి గారు అన్నారు. అవగాహన రహిత్యంతో వైసిపి ప్రభుత్వం కావాలనే పసలేని కేసు పెట్టడం వల్ల ఈ కేసు కొట్టవేయబడిందని జనసేన నేత లాయర్ జయరామిరెడ్డి గారు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున రాజధానిలో కుంభకోణం చేశారని ఆరోపిస్తు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లిలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోమణ్‌రెడ్డి ప్రస్తావించారన్నారు. వీటన్నింటిని గమనిస్తే తెదేపా – వైకాపా 60-10 శాతం వాటాతో నాటకాలు ఆడుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఏకమై దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని రాజధాని విషయంలో అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి త్వరలోనే ఈ రెండు పార్టీలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని జనసేన నేత లాయర్ జయరామిరెడ్డి గారు అన్నారు.