Logo
Date of Publish : 23 July 2021, 6:17 am
Editor : Sake Naresh

వైకాపా – తెదేపా దొందూ దొందే : జనసేన నేత లాయర్ జయరామి రెడ్డి

         సుప్రీమ్‌ కోర్టు రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరగలేదని తీర్చు ఇచ్చిందంటే ప్రభుత్వమే క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టుగా ఉందని జనసేన నేత జయరామి రెడ్డి గారు అన్నారు. అవగాహన రహిత్యంతో వైసిపి ప్రభుత్వం కావాలనే పసలేని కేసు పెట్టడం వల్ల ఈ కేసు కొట్టవేయబడిందని జనసేన నేత లాయర్‌ జయరామిరెడ్డి గారు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున రాజధానిలో కుంభకోణం చేశారని ఆరోపిస్తు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు  కావాలని అసెంబ్లిలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోమణ్‌రెడ్డి ప్రస్తావించారన్నారు. వీటన్నింటిని గమనిస్తే తెదేపా - వైకాపా 60-10 శాతం వాటాతో నాటకాలు ఆడుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఏకమై దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని రాజధాని విషయంలో అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి త్వరలోనే ఈ రెండు పార్టీలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని జనసేన నేత లాయర్‌ జయరామిరెడ్డి  గారు అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com