బాపట్ల పట్టణంలో సచివాలయ ప్రతినిధిగ బాధ్యతలు నిర్వహిస్తున్న 23వ వార్డులో గల ఉమ్మారెడ్డి సరోజినీదేవి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, వార్డు ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉందని జనసేన నాయకులు తోట సాయి కుమార్ గారు అన్నారు. కాలనీలోని డ్రైనేజి వ్యవస్థను శుభ్రపరిచి చాలా కాలం గడిచిన కారణంగా డ్రైనేజీ మీద ఉన్న బండలు చాలా చోట్ల పగిలిపోయి, మురుగునీటి పారుదల ఆగిపోవడం మరియు కాలువ ఇరువైపుల పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయిన విషయం దయచేసి గమనించాలని కోరారు. అన్నిటికంటే ప్రధానంగా ఈ డ్రైనేజీ సమస్యల వలన ఈ మధ్య కాలంలో పరిసర ఇళ్లల్లోకి పాములు రావడం కాలనీలోని ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నది. కావున ఈ వార్డులో నెలకొన్న పరిస్థితులను త్వరితగతిన సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేసి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దరించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల తరపున 23వ వార్డు జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.