Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డు ఆవశ్యకత – అభివృద్ధికి మార్గం

                 ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంకు ప్రయాణించడానికి చాల విస్తారంగా ఉపయోగించే రవాణా మార్గం రోడ్డు మార్గం. ఏ దేశంలో అయినా ప్రాంతంలో అయినా రోడ్లు ప్రధాన భూ రవాణా వ్యవస్థగా పరిగణిస్తారు. కేవలం ప్రజల్ని ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి తీసుకొని పోవడానికే కాకుండా రోజు వారి సరుకులు, వస్తువులు ఇతరత్రా రవాణా చేసుకునేందుకు కూడా రోడ్డు రవాణా ఉపయోగ పడుతుంది. రాష్ట్రాల నుండి పల్లెల వరకు ప్రతి ఊరి నలుమూలలకు చేరగలిగేదే రోడ్డు రవాణా. రైలు మార్గాలు, నీటి మార్గాలు, వాయు మార్గాలు చేరలేని మారుమూల ప్రదేశాలకి సైతం చేరువ చేయగలిగేవే రోడ్డు మార్గాలకు కలవు. రోడ్డు అభివృద్ధి అంటే పరోక్షంగా ఆ ప్రాంత అభివృద్ది అవుతుంది. రోడ్డు అభివృద్ధి చెందితే రవాణా సౌకర్యం కలిగి ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. రోడ్లు మన అవసరం మాత్రమే కాదు. మన ప్రాణాన్ని రక్షిస్తాయి. మనకు భద్రతను ఇస్తాయి. ఒక అభివృద్ధి చెందే దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి. నిర్మాణ రంగంలో మరియు నిర్వాహణ రంగంలో రోడ్ల నిర్మాణం భారీ శ్రమతో, భారీ మెషీన్లతో, భారీ ఖర్చులతో కూడుకున్న విషయం. అందుకే ఇందులో భారీ ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్థానికులకు ఉపాధి సృష్టించగలము. మనం వివిధ రకాల రోడ్లు, అవి నిర్మాణ మరియు నిర్వాహణ బాధ్యతల మండలుల గురించి, రోడ్ల నిర్మాణానికి ఎవరిని సంప్రదించాలి అనే విషయాల గురించి వీలైనంత తెలుసుకుందాం.
రోడ్లు వర్గీకరణ :
            రోడ్లు అక్కడ పరిస్థితులు, ట్రాఫిక్ వాల్యూం, ఆర్ధిక వ్యవస్థ, ట్రాఫిక్ రకాలు మొదలగునవి పరిగణంలోకి తీసుకొని వర్గీకరిస్తారు. ఇందులో ప్రధానమైనవి : ఎక్స్ ప్రెస్ రహదారులు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, ఇతర రోడ్లు ( పట్టణ, గ్రామీణ రోడ్లు ).
ఎక్స్ ప్రెస్ రహదారులు : ట్రాఫిక్ ని పాక్షికంగా లేదా పూర్తిగా నియంత్రించబడిన హైవేని ఎక్స్ ప్రెస్ హైవే అంటాము. ఈ హైవే లు బహుళ లేన్లతో విభజించిన లేదా అడ్డరోడ్డు కలిగిన హై స్పీడ్ రహదారులు. వీటి పర్యవేక్షణ జాతీయ రహదారుల మండలి (National Highway Authority of India) చూసుకుంటుంది. ఈ జాతీయ రహదారుల మండలి రోడ్లు మరియు హైవే మంత్రిత్వ శాఖ(MoRTH) పరిధిలో పని చేస్తుంది. మొత్తం 1445 KM ఎక్స్ ప్రెస్ హైవే లు దేశం మొత్తంలో ఉన్నాయి. అందులో మొదటి ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ హైవే 94.5 KM పొడవుతో 2002 లో నిర్మించ బడింది.
జాతీయ రహదారులు : దేశ రాజధానికి అనుసంధానించే ప్రధాన రహదారులను జాతీయ రహదారులు అంటాము. కనీసం రెండు లేన్లతో దేశమంతటా విస్తరించి ఉంటుంది.వీటి పర్యవేక్షణ జాతీయ రహదారుల మండలి (National Highway Authority of India) చూసుకుంటుంది. ఈ జాతీయ రహదారుల మండలి రోడ్లు మరియు హైవే మంత్రిత్వ శాఖ (MoRTH) పరిధిలో పని చేస్తుంది. NH-44 ఇది ఉత్తరాన శ్రీనగర్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు 3,745 కిలోమీటర్ల పొడవున భారత దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి.
రాష్ట్ర రహదారులు : రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలను అనుసంధానించే రెండవ అతి ప్రధాన రహదారులు రాష్ట్ర రహదారులు. వీటి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పబ్లిక్వర్క్స్ విభాగం (PWD) వారు చూసుకుంటారు. రాష్ట్ర రహదారులు చివరికి జాతీయ రహదారిలో కలుస్తాయి.
జిల్లా రహదారులు : ప్రధాన రాష్ట్ర రహ దారులు మరియు జాతీయ రహదారులకు అనుసంధానంగా జిల్లా రహదారులు పని చేస్తాయి. నగరంలోనే జిల్లా రహదారులు ఉంటాయి. వీటి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ విభాగం (PWD) వారు చూసుకుంటారు.
ఇతర రోడ్లు : ఇతర రోడ్లలో ప్రధానంగా గ్రామీణ రోడ్ల గురించి మాట్లాడుకోవాలి. ఇవి సమీపాన ఉన్న జిల్లా ప్రధాన రోడ్లు, రాష్ట్ర ప్రధాన రోడ్లు, జాతీయ రహదారులను కలుపుతాయి. 2000 సం.రం ముందు వరకు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నిర్మించేవి. 2000 సం.రం తర్వాత నుండి గ్రామీణ రోడ్లు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) పధకం కింద నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది.
వివిధ రకాల రోడ్లు :
మట్టి రోడ్లు తక్కువ ఖర్చుతో పూర్తయ్యి మట్టితో వేయబడుతాయి. సాధారణంగా తక్కువ ట్రాఫిక్ ప్రాంతాలలో మరియు గ్రామాలలో ఇవి వేస్తుంటారు. తక్కువ ఖర్చు మరియు తక్కువ నాణ్యతతో కూడిన రోడ్లు. కంకర రోడ్లు మట్టి రోడ్లతో పోలిస్తే ఇవి కొంచెం నాణ్యత మరియు ఖర్చు కూడా ఎక్కువే. ఇందులో కంకర మరియు ఇసుక మిశ్రమంతో కలిపి నిర్మిస్తారు. WBM రోడ్లు పిండి చేసిన కంకర లేదా తక్కువ పరిమాణం గల కంకర ఈ రకం రోడ్ నిర్మాణం లో బేస్ పదార్ధంగా ఉపయోగిస్తారు. ఎక్కువ ట్రాఫిక్ ని లేదా ఎక్కువ బరువుని తట్టుకోలేవు కాని కంకర రోడ్ తో పోలిస్తే మెరుగైన పనితీరు చూపిస్తాయి. కాంక్రీట్ రోడ్లకి నిర్మాణ ఖర్చు ఎక్కువ నిర్వాహణ ఖర్చు తక్కువ. కాని పట్టుత్వం తక్కువ ఉండడం వలన వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదంఎక్కువ. అందుకే రహదారుల నిర్మాణంలో ఈ రకాల రోడ్లు తక్కువ ఉపయోగిస్తారు. ఎక్కువ ట్రాఫిక్ మరియు బరువుని సైతం తట్టుకోగలవు. నిర్మాణ సమయం కూడా ఎక్కువే. బిటుమేన్ రోడ్లు ప్రపంచవ్యాప్తంగా రహదారుల నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగించే రోడ్లు బిటుమెన్ రోడ్లు. వీటి నిర్మాణ వ్యయం తక్కువ నిర్వాహణ వ్యయం ఎక్కువ. నేల సామర్ధ్యం మరియు రకం బట్టి వివిధ రకాల గ్రేడ్లు గా విభజించి బిటుమెన్ రోడ్లు వేస్తారు.
రోడ్లు వివిధ కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా నిర్మిస్తారు. అందులో ప్రధానమైనది :
PPP(PUBLIC PRIVATE PARTNERSHIP) పద్ధతి:
            ఈ విధమైన వాణిజ్య పరమైన ఒప్పందం ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతాయి. ఇందులో ప్రజా సేవ అందించడానికి ఒక ప్రైవేటు రంగానికి ప్రభుత్వ ఆస్తులు నిర్వహణకు గాని పెట్టుబడులు పెట్టడానికి కాని ప్రభుత్వం ఆహ్వనిస్తుంది. ఇందులో పేర్కొన్న లేదా ముందుగా నిర్దేశించిన విధంగా ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థకు మధ్య రిస్క్ కేటాయించబడుతుంది. పనులు బాగా నిర్వహించినప్పుడు ముందుగా అనుకున్న విధంగా డబ్బులు లేదా ప్రోత్సాహకాలు ప్రైవేటు సంస్థ కి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలాంటి పద్ధతుల ద్వారా నిర్మించడం వలన కొంత పరిధి కాలం వరకు నిర్మించిన భాగాన్ని ప్రైవేటు సంస్థ నిర్వహణ కూడా చూసుకుంటుంది.
ప్రభుత్వాన్ని రోడ్లు వేయమని ఎలా అభ్యర్ధించాలి :
             ప్రభుత్వం చేత అడిగి పని చేయించుకునే హక్కు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడుకి ఉంది. కాని ప్రతి దానికి ఒక నియమ నిబంధనలు తప్పక ఉంటాయి. అది మాత్రమే కాదు ప్రభుత్వాన్ని లేదా ప్రాంతీయ నాయకులని ప్రశ్నించే ముందు వాళ్ళు పదవులో ఉన్నారని మనం గుర్తు పెట్టుకోవాలి. అడిగి పని చేయించుకోవడం మన హక్కు ఎలానో, పని చేయకపోతే ప్రశ్నించడం కూడా దేశ పౌరునిగా మన హక్కు. జాతీయ రహదారులు లేదా హైవే మంత్రిత్వ శాఖ(MoRTH) పరిధిలోని రోడ్ల గురించి కంప్లైంట్ లేదా సమస్యల గురించి దగ్గరలో ఉన్న జాతీయ రహదారుల రీజినల్ ఆఫీస్ కి లేదా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్ ని సంప్రదించాలి. మనం పొందు పరిచే ప్రతి రహదారి సమస్యకు వాళ్ళు తప్పక జవాబు ఇస్తారు లేదా పరిష్కారం చూపిస్తారు. మీ ప్రాంతంలో రోడ్డు బాగోలేదనో, లేదా కొత్త రోడ్ వేయమనో ఆ ప్రాంత సర్పంచ్ /గ్రామ పెద్ద /మునిసిపల్ కౌన్సిలర్/ లోకల్ లో ఎన్నిక అయిన లీడర్ కి మీ ప్రాంతంలో ఉన్న కొందరు కలిసి ఒక అభ్యర్ధన పత్రం రాయాలి. రాసిన కోద్ది రోజులు వేచి చూసి అప్పటికి పని జరగకపోతే మీ ప్రాంత ఎమ్మల్యేకి ప్రాంత వాసులు అంతా కలిసి అభ్యర్ధన పత్రం ఫోటోలతో సహా సమర్పించాలి. ఎప్పటికీ స్పందన లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్రాసి ఆ కాపీ ని PWD లేదా రవాణా శాఖ మంత్రికి పంపాలి. ఇక్కడ మీరు గుర్తు ఉంచుకోవ్కాల్సింది ఏమిటి అంటే పైన చెప్పిన పనులు ఏవైన వ్యక్తిగతంగా చేయరాదు.. మీ ప్రాంత ప్రజలతో మాట్లాడి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మీ డిమాండ్ ని సంఘం లెటర్ హెడ్ పై విన్నవించాలి.
               ఈ సందర్భాలలో ఏ ఒక్క నాయకునితో స్థానిక అధికారులతో కాని ఎటువంటి పరిస్థితిల్లో వ్యతిరేఖించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడిగా ముందుకి సాగకుండా అందరితో కలిసి తక్కువ ప్రొఫైల్ తో ముందుకు వెళ్ళాలి. ఏ పని రాత్రికి రాత్రే జరగదు కాబట్టి వేచి చూడాలి. అలా ప్రభుత్వాన్ని ప్రాంతీయ నాయకులని లేదా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఏమి జరుగుతుందో మనం చాల ఉదంతాలు చూసాము కూడా. రోడ్లు వేయడానికి కార్పొరేషన్ లేదా ప్రభుత్వ ఆమోదం తప్పని సరి కాబట్టి దీనికి ఎక్కువ సమయం పడుతుంది.
సంప్రదించాల్సిన చిరునామా :
ఆంధ్రప్రదేశ్ CM Mail ID : cm@ap.gov.in
ఆంధ్రప్రదేశ్ R&B Minster Mail ID : sankarnarayanamalagundla@gmail.com
ఆంధ్రప్రదేశ్ PWD కాంటాక్ట్స్ : https://aprdc.ap.gov.in/UI/keycontacts.aspx
             ప్రభుత్వాలు మారుతున్న ప్రజల జీవన శైలిలో మార్పు మాత్రం శూన్యం లేదా అంతంత మాత్రం గానే ఉంది. రోడ్లు సదుపాయం కల్పించడం వలన ఉద్యోగ అవకాశాలు రావడమే కాక ఇంకొక ప్రాంతానికి వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పించిన వారు అవుతారు.ఇప్పటకి రోడ్డు సదుపాయం లేక చాలా చోట్ల, అత్యవసర పరిస్థితిల్లో సైతం భుజాన మోసుకుని లేదా డోలి కట్టుకొని మోసుకుని పోవాల్సిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని చోట్ల అయితే ప్రభుత్వాలకి విన్నపాలు పెట్టుకుని విసుగు వేసారి ఏమి చేయలేని పరిస్థితుల్లో సొంత డబ్బులు చందాగా వేసుకొని రోడ్లు వేయించుకోవడం మనం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూస్తూనే ఉన్నాము.
            ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీగా కూడా వ్యవహరించాలి. అవసరం లేని వాటికి డబ్బులు తగలబెట్టి ప్రజల్ని సోమరిపోతుల్ని చేసేదానికంటే నాలుగు తరాలకి ఉపయోగ పడే పనుల పైన దృష్టి పెట్టడం మంచిది. వివిధ రకాల పన్నుల పేరుతో మన దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీస సౌకర్యాలు అందించడం లేదా అందించాలని కోరుకోవడం మన హక్కు.

#Written By
నాని
ట్విట్టర్ ఐడి : @Thanos_Tweetss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
WhatsApp Image 2024-09-21 at 9.33
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 100 రోజుల పరిపాలనపై విశ్లేషణ
20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way