రేషన్ సరఫరా కోసం వేలకోట్లు ప్రజాధనం నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం : విశాఖ పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ

                    ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ సరుకులు ఇంటింటికి పంచేందుకు చిన్న వ్యానుల కోసం వేల కోట్లు ఖర్చు చేశారు. రేషన్ సంచుల కోసం 750 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇక ఆ వాహానాల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిందో అర్థం చేసుకోవచ్చు. “గడప వద్దకే నాణ్యమైన బియ్యం” పధకం విఫలం అయిందని 530 కోట్ల పైచిలుకు డబ్బుతో 9260 వాహనాలు కొని చెప్పినపని సక్రమంగా చెయ్యలేకపోతుంది ఈ వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. మూడు రోజులు పని చేస్తే మిగతా 27 రోజులు మూలాన పడి ఉంటాయి. ఇలాంటి వాటికోసం ఇన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని నిర్వీర్యం చేయడం చూస్తుంటే ప్రభుత్వ అసమర్థత తెలుస్తోందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పౌరులు నెలలో ఒకరోజు రేషన్ సరుకులు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న డీలర్ షాపు కి వెళ్ళి సరుకులు తీసుకోలేని సోమరితనంగా లేరు. ప్రజా ధనాన్ని వైసీపీ కాంట్రాక్టర్లకే ముట్టజెప్పి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. లోటుబడ్జెట్లో, అప్పులు తెచ్చి దుబారా ఖర్చులు చేస్తున్న జగన్ గారు, ఇప్పటికి అయినా బుద్ధి తెచ్చుకొని తప్పులు సరిదిద్దుకోవాలన్నారు.  ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇన్ని వేల కోట్లను ఇలా వృధా చేసేకంటే పరిశ్రమల కోసం వెచ్చించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో పార్టీ రంగుల కోసం 1300 కోట్లు వెచ్చించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేసారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఈ పధకాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలుపూర్తి అయ్యే వరకూ ఆపివేయాలి అని మేము కోరుతున్నామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way