Logo
Date of Publish : 04 February 2021, 7:58 am
Editor : Sake Naresh

రేషన్ సరఫరా కోసం వేలకోట్లు ప్రజాధనం నిర్వీర్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం : విశాఖ పశ్చిమ జనసేన నాయకులు పీలా రామకృష్ణ

                    ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ సరుకులు ఇంటింటికి పంచేందుకు చిన్న వ్యానుల కోసం వేల కోట్లు ఖర్చు చేశారు. రేషన్ సంచుల కోసం 750 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇక ఆ వాహానాల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిందో అర్థం చేసుకోవచ్చు. "గడప వద్దకే నాణ్యమైన బియ్యం" పధకం విఫలం అయిందని 530 కోట్ల పైచిలుకు డబ్బుతో 9260 వాహనాలు కొని చెప్పినపని సక్రమంగా చెయ్యలేకపోతుంది ఈ వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. మూడు రోజులు పని చేస్తే మిగతా 27 రోజులు మూలాన పడి ఉంటాయి. ఇలాంటి వాటికోసం ఇన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని నిర్వీర్యం చేయడం చూస్తుంటే ప్రభుత్వ అసమర్థత తెలుస్తోందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పౌరులు నెలలో ఒకరోజు రేషన్ సరుకులు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న డీలర్ షాపు కి వెళ్ళి సరుకులు తీసుకోలేని సోమరితనంగా లేరు. ప్రజా ధనాన్ని వైసీపీ కాంట్రాక్టర్లకే ముట్టజెప్పి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. లోటుబడ్జెట్లో, అప్పులు తెచ్చి దుబారా ఖర్చులు చేస్తున్న జగన్ గారు, ఇప్పటికి అయినా బుద్ధి తెచ్చుకొని తప్పులు సరిదిద్దుకోవాలన్నారు.  ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇన్ని వేల కోట్లను ఇలా వృధా చేసేకంటే పరిశ్రమల కోసం వెచ్చించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గతంలో పార్టీ రంగుల కోసం 1300 కోట్లు వెచ్చించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేసారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఈ పధకాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలుపూర్తి అయ్యే వరకూ ఆపివేయాలి అని మేము కోరుతున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com