
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో త్రాగునీటి సమస్య ముఖ్యమైనది. ఇందుకు కారణంగా మండలంలోని 17 పంచాయతీలలో గల గ్రామాలలో ఎక్కడైతే నీటి సమస్య ఉందో అదేవిధంగా వాటర్ ట్యాంక్ మరమ్మత్తులు జరపాలని ప్రతి రెండు ఇళ్లకు ఒక కుళాయి అమర్చాలని స్థానిక జనసేన నాయకులు ఎంపిడిఓ కు వినతి పత్రాన్ని అందించారు. పాడుబడ్డ బోర్లను మరమ్మత్తులు చేయించాలని కోరారు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయినా త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోవడం దారుణ౦ అన్నారు. వీలయినంత త్వరగా సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ధర్నాకు దిగుతామని జనసేన నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరీష్, రామకుప్పం మండలం జనసైనికులు పాల్గొన్నారు.