చిరంజీవిని రక్త వ్యాపారి అని పిలిచి మానసిక క్షోభకు గురి చేసిన కుటుంబం వైస్సార్ ది. పవన్ కళ్యాణ్ ని రెండు రోజులు హోటల్ రూంలో బందించిన వ్యక్తి జగన్.. పవన్ తల్లిని తిట్టించిన వ్యక్తి జగన్.. లెక్కలేనన్ని వ్యక్తిగత దూషనలు చేసిన వ్యక్తి జగన్… నాడు నేడు కూడా రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేసిన వ్యక్తి జగన్… చెయ్యని స్కాం లేదు. చేసిన అరాచకాలకు లెక్కే లేదు. వాడు చేసినవి వింటుంటే మనకే రగిలిపోతుంటే కళ్యాణ్ కి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తన సినిమాలకు వేధింపులు, తనపై చేసిన వ్యక్తిగత విమర్శలు, తానే ఎదురుకున్న దాడులు పవన్ కళ్యాణ్ అయితే మర్చిపోడు కదా?
ఆ సీట్లు సంఖ్య చూసి నేను కూడా ఒక రోజు బాధపడ్డాను. ఒకరోజు పట్టింది బాలన్స్డ్ గా ఆలోచించడానికి. మనం బాలన్స్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటే పార్టీకి అంత నష్టం. కాబట్టి వెంటనే వాస్తవంలోకి రావాలి.జ గన్ వెయ్యి తలల రాక్షసుడు. ఇసుక మద్యం డబ్బు దోచుకుని బరితెగించి ఉన్నాడు. అటువంటివాడిని ఓడించడానికి మన ఒక్కరి బలం సరిపోదు అనేది వాస్తవం. మనం తక్కువ సీట్లలో పోటీ చెయ్యడం పవన్ కు మాత్రం ఇష్టమా? మన పరిస్థితే ఇలా ఉంటే పవన్ పరిస్థితి ఎలా ఉండి ఉండొచ్చు. అక్కడ త్యాగం చేసింది నష్టాలు ఎదురుకుంటున్నది పవన్ కళ్యాణ్ కదా… పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినా తన వెంటే నడిచిన అభిమానులు ఇప్పుడు డీలా పడిపోవడం చూస్తున్నాం.
ముందుగా అభిమానుల కోసం కొన్ని వాస్తవాలు :
2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో మనం చెప్పిన ఆటే ఆడాడు. మన భావోద్వేగాలకు తగ్గట్లుగా స్పందించాడు. ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ నాయకుడు మోడీ “మేరా సాత్ పవన్ హై” అని బహిరంగ సభలో చెప్పినా, మన కోసం కాదనుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేసాడు. టీడీపీతో తెగదేంపులు కూడా అప్పుడు మనకి ఉన్న ఎమోషన్స్ కారణం. ఫలితం disastrous. తానే రెండు చోట్ల ఓడిపోయాడు. కొన్ని చోట్ల నోటాకంటే తక్కువ ఓట్లు రావడం సిగ్గుపడినా తెలుసుకోవాల్సిన వాస్తవం. తాను పోరాడిన ఉద్దానం కూడా తనకి ఓటు వెయ్యని దుస్థితి. చాలా మంది అభ్యర్థులు టిక్కెట్ తీసుకునే ముందు చాలా ఖర్చు పెడతాం అని చెప్పి టికెట్ తీసుకున్నాక కనీసం క్యాడర్ కి పులిహోర కూడా పెట్టలేకపోయారు. కనీసం బూత్ ఏజెంట్లను పెట్టలేకపోయారు. ఈ ఇంచార్జిలు ఎన్నికల తరువాత ఏమైనా పని చేశారా అంటే చాలామంది ఇవ్వాల్టికి కూడా గ్రామ కమిటీలు వెయ్యలేకపోయారు. సాధారణ పార్టీ కార్యక్రమలకు కూడా డబ్బులు తియ్యరు. ఇంచార్జిలు మీద లోకల్ క్యాడర్ చాలా చోట్ల విస్తుపోయి ఉన్నారు. మనం ఫాన్సీగా చెప్పుకునే కొన్ని పేర్లు గురించి వారి నియోజకవర్గాల్లో అడిగి చూడండి. రాయలసీమ, పల్నాడు లాంటి ఫ్యాక్షన్ జోన్లలో పోటీ చేసి రక్తపాతంలో పాల్గొనే శక్తీ జనసేనకు లేదు. ఆ విధంగా జనసైనికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కళ్యాణ్ గారికి లేదు. కాబట్టి మన సీట్ల సంఖ్యను కోస్టల్ ఆంధ్రతో మాత్రమే పోల్చి చూడాలి.
మీరు ఒక ఇంచార్జి పేరు తీసుకోండి. మీరు చెప్పే ఇంచార్జి ఎన్ని ఎంపీటీసీ/జడ్పీటీసీ/కౌన్సిలర్ గెలిపించాడు చెక్ చెయ్యండి. వైస్సార్సీపీ అభ్యర్థితో ఆర్ధికంగా పోటీ పడే సామర్ధ్యం అడగట్లేదు. కనీసం వాడిలో పదో వంతు అయినా ఖర్చు పెట్టే సామర్ధ్యం ఉందేమో చెక్ చెయ్యండి. గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు వేసాడా? స్థానిక జనసైనికుల మన్ననలు, సపోర్ట్ పొందగలిగాడా? ఈ ప్రాతిపాధికలు అన్నింట్లో అర్హులు అయితే అప్పుడు చెప్పండి చూద్దాం. జగన్ లాంటి రాక్షసుడు మీద పోరాడుతున్నప్పుడు మనం ఎమోషయిన్ అయితే జగన్ కి లాభం చేకూర్చినవాళ్ళం అవుతాం. సో వాస్తవ దృక్పధంలోకి వీలైనంత త్వరగా రావాల్సి ఉంటుంది.
ఇక వైస్సార్సీపీ వాళ్ళ దగ్గరకు వద్దాం..
ఈ వైస్సార్సీపీ బామ్మర్థులు సడన్ గా మనకి శ్రేయోభిలాషులు అయిపోయినట్లు ఆస్కార్ యాక్టింగ్ చేసేస్తున్నారు ఏంటి? నిన్నటిదాకా జనసేనకు అసలు బలమే లేదని చాలా భలంగా వాదించిన నోర్లు ఇప్పడు జనసేనకు ఇన్ని తక్కువ సీట్లా అంటున్నారు. అరె బాబు క్లారిటీగా చెప్పండ్రా మేము బలవంతులమా, కాదా? మీ పార్టీ ఓడిపోతాం అని ఒప్పుకుని 80 సీట్లు అభ్యర్థులను మార్చేసింది. మీ అభ్యర్థులుగా ప్రకటించిన 9 మంది మీ ఫోన్ ఎత్తడం మానేసి అమెరికా వెళ్లిపోయాము అని తప్పించుకుని తిరుగుతున్నారు.
కాపు శ్రేయోభిలాషుల దగ్గరకు వద్దాం.
కాపులు పరువు తీసేసాడు అంట. ఎలా అంటే తక్కువ సీట్లు తీసుకున్నాడు అంట. పవన్ కులానికి అతీతుడు అయినప్పటికీ మీ భాషలో పచ్చిగా మాట్లాడుకుందాం. ఒక కాపోడు తన వర్గానికి 24 MLA సీట్లు తెచ్చుకోగలిగాడు. వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలిచి తదుపరి తరం నాయకులుగా తయారు అవ్వడం తద్యం. వైస్సార్సీపీ టీడీపిల్లో ఉన్న ఒక్క కాపు నాయకుడు అయినా వేరే ఎవరికి అయినా ఒక్క టికెట్ ఇప్పించగలరా?
బాధపడిన మనం ఈ బాధను కసిగా మార్చుకుని జనసేనాని పరిస్థితి అర్ధం చేసుకుని పని చెయ్యాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. బీహార్ అసెంబ్లీ పరిస్థితి చూడండి. ఆర్జెడి 75, బీజేపీ 74, జేడీయుకి 40 సీట్లు వచ్చాయి అయినా 5 సంవత్సరాలనుండి జేడీయూ అధ్యక్షుడు అయిన నితీష్ సీఎంగా ఉన్నాడు.
రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మూడో ప్రాంతీయ పార్టీకి స్కోప్ చాలా తక్కువ. మూడో ప్రాంతీయ పార్టీ రావడం ఏటికి ఎదురీదడమే. చరిత్రలో అలా సక్సెస్ అయిన ఉదాహరణ ఒకటి కూడా లేదు. అంత శక్తి ఉండి తమిళనాడులో బీజేపీ పరిస్థితి చూస్తే అర్ధం చేసుకోవచ్చు. వైస్సార్సీపీ, టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా పాతుకుపోయిన సందర్భంలో మనం వచ్చాం. కాబట్టి జనసేన ఎదుగుదల చాలా స్లోగా ఆర్గానిక్ గా ఉంటాది అని మనం అర్ధం చేసుకోవాలి. ఆర్గానిక్ గ్రోత్ బలమైన పునాదులతో దీర్ఘకాలం ఉంటుంది. అప్పటివరకు నమ్ముదాం. నమ్మడం తప్ప మనం చేసే పెట్టుబడి ఏమీ లేదు. మన నమ్మకంతో దీర్ఘకాలంలో సమాజంలో మంచి చేసే ఒక నాయకుడుకి తోడ్పాటు అందించినవాళ్ళం అవుతాం. మనం నమ్మేది పరిస్థితుల ప్రభావంలో ఇరుక్కున్న ఒక నిజాయితీపరుడిని.
మీ
ట్విట్టర్ ( X ) : @Teluguchegu