పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ ఆదేశాల మేరకు జనం కోసం జనసేన టీం ఆధ్వర్యంలో 11వ వార్డులో పర్యటించారు. 20 పేద కుటుంబాలకి బుర్రా సూర్యప్రకాశ రావు బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది. 11వ వార్డులో షేక్ ధూర్పి మాట్లాడుతూ ఇప్పటివరకు మా వార్డుకీ ఏ పార్టీ వచ్చింది లేదు మా కష్ఠాలు ఎవరు అడిగింది లేదు. కానీ, ఈరోజు జనసేన పార్టీ వసమన్వయ టీము వచ్చి మా కష్టాలు అడిగి తెలుసుకుని నిరుపేదలకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈసారి మేము జనసేన పార్టీకే మద్దతుగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, బుర్ర సూర్యప్రకాశరావు, టైల్స్ బాబీ, కర్రీ కాశీ, మల్లం శ్రీనివాసరావు, పెద్దిరెడ్ల భేమేశ్వరావు, కసిరెడ్డి నాగేశ్వరరావు, మారౌతు సూరిబాబు, శెట్టి శ్రీను, షేక్ దూర్పి, షేక్ బాబ్జి ,కోలా దత్తు , కోలా మణికంఠ, గాజుల సూర్య, లక్ష్మణ్, పప్పులు సాయి, పబ్బిరెడ్డి సురేష్, మరియు పి.ఎస్.ఎన్ మూర్తి పాల్గొన్నారు.