గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం పంచాయితీ., విజయమాంబాపురంలో నూతన సంవత్సర వేడుకలు జనసేనపార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామస్తుల మధ్యలో కేకు కేట్ చేసి, జన స్వరం క్యాలెండర్ ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, కాపు సంక్షేమ సేన మండల అధ్యక్షులు రవి, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి నరేష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు దేవా, నియోజకవర్గ కార్యదర్శి అన్నామలై, ఎం ఎం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.