ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ అఖిల భారత చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సీఈఓ స్వామి నాయుడు గారి చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవకి మరో పేరు మెగా అభిమానులని ఏ వ్యక్తికి అయినా రక్త అవసరం అంటే స్పందించే గుణం మెగా అభిమానుల సొంతం అని తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ అభిమానులను సేవ వైపు నడిపిస్తూ సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచిన చరిత్ర మెగాస్టార్ చిరంజీవి గారిది మరియు మెగా ఫ్యామిలీలోని అలాంటి మెగా కుటుంబానికి అభిమానులుగా ఉండడం తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, రమేష్, హరి తదితరులు పాల్గొన్నారు.