మలిశెట్టి ఆధ్వర్యంలో 133 వ రోజు కొనసాగుతున్న పవన్ అన్న ప్రజా బాట

  రాజంపేట ( జనస్వరం ) : సుండుపల్లి మండలం రాయవరం పంచాయతీలో పలు గ్రామాలలో కావలి పల్లి, సీనేపల్లి, బొంగొలపల్లి,జంగంపల్లి, రచపల్లి, కుడుంవా oడ్ల పల్లిలో 133 వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ గారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిపార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు సుగుణమ్మ, లక్ష్మమ్మ, పోలిశెట్టి రజిత, శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way