ఎచ్ఛర్ల ( జనస్వరం ) : రణస్థలం మండలం, పైడిభీమవరం పంచాయతీ సంచం గ్రామంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త డా విష్వక్సేన్ పర్యటించారు. వర్షం పడుతున్నా, గొడుగులతో నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. వరి రైతులు మాట్లాడుతూ ఈ తుఫాను వల్ల పండించుకున్న పంట మెత్తం చేతిలోకి అంది జారిపోయింది. అని కన్నీళ్లు పెడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి అని రైతులు విష్వక్సేన్ గారికి తెలియజేసారు. విష్వక్సేన్ మాట్లాడుతూ తుఫాను నష్టం అంచనాలకు అందడం లేదు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలి. తక్షణమే ఎకరాకు 20వేలు రూపాయిలు ప్రభుత్వం ఇవ్వాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి గారు, వడ్డాది శ్రీనివాసరావు, బార్నల దుర్గారావు, కాకర్ల బాబాజీ, రైతులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.