గుంతకల్ ( జనస్వరం ) : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని స్మరించుకుంటూ గుంతకల్ పట్టణం బెంజ్ కొట్టాల అంబేద్కర్ యువత మరియు జనసైనికులు, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ భారతీయ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్టడుగున ఉన్న వర్గాలను సైతం చట్టసభల వైపు నడిపించేలా ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. వర్తమాన సమాజం లోని యువత మన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, రాజ్యాంగ రచన కోసం ఆయన ఎంతగా శ్రమించారో తెలుసుకోవాలని, అణగారిన వర్గాల ఉన్నతి కోసం చర్చల్లో తన అభిప్రాయాన్ని ఎంత బలంగా వినిపించేవారు ఈ తరం యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆయన ఆశయాలను అవగాహన చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని యువతని కోరారు. ఈ కార్యక్రమంలో బెంచ్ కొట్టాలు అంబేద్కర్ యువత, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…