Logo
Date of Publish : 06 December 2023, 10:34 pm
Editor : Sake Naresh

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు బి.ఆర్ అంబేద్కర్

    గుంతకల్ ( జనస్వరం ) : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని స్మరించుకుంటూ గుంతకల్ పట్టణం బెంజ్ కొట్టాల అంబేద్కర్ యువత మరియు జనసైనికులు, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ భారతీయ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్టడుగున ఉన్న వర్గాలను సైతం చట్టసభల వైపు నడిపించేలా ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. వర్తమాన సమాజం లోని యువత మన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, రాజ్యాంగ రచన కోసం ఆయన ఎంతగా శ్రమించారో తెలుసుకోవాలని, అణగారిన వర్గాల ఉన్నతి కోసం చర్చల్లో తన అభిప్రాయాన్ని ఎంత బలంగా వినిపించేవారు ఈ తరం యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆయన ఆశయాలను అవగాహన చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని యువతని కోరారు. ఈ కార్యక్రమంలో బెంచ్ కొట్టాలు అంబేద్కర్ యువత, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు...


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com