విజయనగరం ( జనస్వరం ) : జిల్లా పరిషత్ కార్యలయంలో.. ఆదివారం జరిగిన “వాకర్స్ ఇంటర్నేషనల్ (DISTRICT-102; VIZIANAGARAM, SRIKAKULAM &PARVATIPURAM)19th డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కాన్ఫరెన్స్’23 లో “2023 సంవత్సరంనకు గాను అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు ఉత్తమ వైద్య శిబిరాల నిర్వహణకు ,చలివేంద్రం నిర్వహణకు మరియు స్వేచ్ఛభారత్ కార్యక్రమాల నిర్వహణకు అవార్డులు రావటం జరిగింది. ఈ అవార్డులను డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ శ్రీ కర్రోతు సత్యం,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ టి.చివంజీవిరావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి.డి.నాయుడు,పాస్ట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఐ. గున్నేశ్వరరావు, రీజియన్ కౌన్సిలర్ 1కె.వి.రమణ మూర్తి,రీజియన్ కౌన్సిలర్ 3 జి.కృష్ణంరాజు, పాస్ట్ గవర్నర్ పి.జి.గుప్త చేతుల మీదుగా క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు) కు అందజేశారు. ఈ సందర్భంగా బాలుకు వాకర్స్ క్లబ్ పెద్దలు, అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామి నాయుడు, చింతామణి మహేష్, భవాని రవికుమార్, చందక రాందాస్, జనసేన నాయకులు గురాన అయ్యలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.