బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల పట్నంలో చీలు రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన. టిడిపి పార్టీల దివ్యాంగులతో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు. ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం అవుతూ ఉన్నది నాలుగు సార్లు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి రాకుండా దివ్యాంగులను అవమానపరిచిన ఐదోసారి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 తారీకు ముఖ్యమంత్రి రావాలని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
1. దివ్యాంగులందరకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి
2. 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్క దివ్యంగుడికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలి
3. 300.యూనిట్లు దివ్యాంగుల కుటుంబానికి ఉచితంగా కరెంటు ఇవ్వాలి
4. వ్యాపారం చేసుకుంటున్నా ప్రతి ఒక్క దివ్యాంగుడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలి
5. రాష్ట్ర బడ్జెట్ దివ్యాంగులకు వెయ్యి కోట్లు విడుదల చేస్తానని
6.దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని జనసేన. టిడిపి పార్టీ. దివ్యాంగుల డిమాండ్ చేయడమైనది
ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ కంది వెంకటరెడ్డి, పాత్రు బాల సుందర్, దేవి రెడ్డి శ్రీనివాసరావు, వీర్రాజు పాల్గొన్నారు..