పలాస ( జనస్వరం ) : సకాలంలో వర్షాలు పడక వరి పంటకు నీరు అందక పంటపొలాలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. పంటలపోలాలను కౌలుకు తీసుకున్న కౌలు రైతు పెట్టిన పెట్టుబడి తిరిగి రాక యజమానికి డబ్బులు చెల్లించలేని సదిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈరోజు రైతుకు ఈ పరిస్థితికి రావడానికి కారణం రియల్ ఎస్టేట్ పేరుతో చెరువు, కాలువలు అక్రమణకు గురికావడం, ప్రభుత్వం ఉన్న చెరువులు కాలువలను గాలికి వదిలేయడం. ప్రభుత్వం రైతు కష్టాలను గుర్తించి పలాస నియోజకవర్గం మందస మండలంను కరువుప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం జనసేన నాయకులు మజ్జి భాస్కరరావు, మందస మండలం అధ్యక్షులు కుప్పయి గోపాల్,మాజీ పార్లమెంటరీ కమిటీ మెంబెర్ కంచరన అనిల్, సందీప్, తిరుపతి గౌడ, పందిరి నీలయ్య, ఆనంద్,లక్ష్మణ్, జీవన్, రైతులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.