గుడివాడ ( జనస్వరం ) : పట్టణ మినీ బైపాస్ రోడ్డు గుంతలమయంతో ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడడంతో జనసైనికులు పోరాటంతో రోడ్డు మరమ్మతులు చేసిన ప్రభుత్వ అధికారులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గుడివాడ పట్టణ మినీ బైపాస్ రోడ్డు గుంతలమయంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడంతో ఆ సమస్యను గుర్తించి ఆ గొంతులో దిగి నిరసన కార్యక్రమం తెలియజేయడంతో ఆ సమస్యను ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది ఆర్ అండ్ బి అధికారులకు మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. అదే కాకుండా ఈ రోడ్లు శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమస్యను ప్రభుత్వాధికారులకు చేరవేసిన మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసైనికులు ఉండి ఆ సమస్య తీర్చేదాక పోరాడుతామని ఇ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్నంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ నూనె అయ్యప్ప దివిలి సురేష్ కే కిరణ్ చరణ్ తేజ్ శివ మరియు జనసైనికులు పాల్గొన్నారు.