అనంతపురం ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈనెల 8వ తేదీన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ వారు రుద్రంపేట బైపాస్ రోడ్డు సర్కిల్ నుంచి.. ప్లై ఓవర్ – పెద్ద ఆసుపత్రి మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శనతో కూడిన నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి శింగనమల నియోజకవర్గ నాయకులు దంపెట్ల శివ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం సీఎం జగన్ శాడిజానికి నిదర్శనమని రాజకీయ కక్షతోనే అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ తనలా చంద్రబాబు చేసిన ప్రతి పనిలోనూ అవినీతి ఉందని భావించడం మూర్ఖత్వమని అన్నారు. కేవలం రాజకీయ కక్ష్యతోనే అరెస్ట్ చేసినట్టు భావిస్తున్నామన్నారు. ఎఫ్‌ఐఆర్ లో పేరు లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.