Logo
Date of Publish : 27 September 2023, 9:34 pm
Editor : Sake Naresh

టీడీపీ కాగడాల న్ప్రదర్శనకు నిరసనకు మద్దతు తెలిపిన దంపెట్ల శివ

        అనంతపురం ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈనెల 8వ తేదీన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ వారు రుద్రంపేట బైపాస్ రోడ్డు సర్కిల్ నుంచి.. ప్లై ఓవర్ - పెద్ద ఆసుపత్రి మీదుగా ఎన్టీఆర్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శనతో కూడిన నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి శింగనమల నియోజకవర్గ నాయకులు దంపెట్ల శివ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ  స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం సీఎం జగన్ శాడిజానికి నిదర్శనమని రాజకీయ కక్షతోనే అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్ తనలా చంద్రబాబు చేసిన ప్రతి పనిలోనూ అవినీతి ఉందని భావించడం మూర్ఖత్వమని అన్నారు. కేవలం రాజకీయ కక్ష్యతోనే అరెస్ట్ చేసినట్టు భావిస్తున్నామన్నారు. ఎఫ్‌ఐ‌ఆర్ లో పేరు లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com