Search
Close this search box.
Search
Close this search box.

విద్య ప్రామాణికమా ? రాజకీయమా ??

                            ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద పిల్లలు కూడా చదవాలి అని పేదవారిని ఉద్దరించాలని ‘జగన్నన్న విద్యా కానుక’ ను ప్రారంభించారు. ‘జగన్న విద్యా కానుక’ అనేది 10 వ తరగతి వరకు పాఠశాల పిల్లలకు ప్రభుత్వ పథకం, లక్షలాది మంది విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బూట్లు, సాక్స్, బెల్టులు మరియు పాఠశాల సంచులను సరఫరా చేస్తుంది. 42.3 లక్షల మంది విద్యార్థులకు విద్యార్థి కిట్లను అందించారు. దీని ధర ప్రభుత్వానికి ఏడాదికి 650 కోట్ల రూపాయలు, అనగా ఐదేళ్లకు 3250 కోట్లు..1,600/- ఖర్చుతో, ప్రతి విద్యార్థి కిట్‌లో మూడు జతల యూనిఫాం దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్, ఒక బెల్ట్, ఒక సెట్ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు మరియు పాఠశాల బ్యాగ్ ఉంటాయి. అమ్మ ఒడి కింద పేద పిల్లల తల్లులకు అని చెప్పి పాఠశాలకు పంపినందుకు రూ. 15 వేలు పంపిణీ చేశారు. అవి నిజంగా పేదవారికి అందాయా లేక అవి అందుకోడానికి జనాలు పేదవారీగా మారారా అనేది అందరికీ విదితమే. రూ . 6,500 కోట్ల రూపాయల అమ్మ‌ఒడి పథకం వల్ల 43 లక్షల మంది తల్లులు, వారి వల్ల ఒక రాజకీయ పార్టీ లబ్ధి పొందారు. నాడు-నేడు పథకం కింద 45,000 ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించబడతాయి అని చెప్పారు. ఇప్పటికీ 3600 కోట్లు ఖర్చు అయ్యింది.
అమ్మ ఒడి వల్ల ఎవరు బాగు పడ్డారు? సంక్రాంతి ముందు వేసే అమ్మ ఒడి ఆర్థికంగా ఉపయోగపడి అది వేసిన ముఖ్య ఉద్దేశం పక్క దారి పట్టింది. అప్పుడే విడుదల అయినా రెండు సినిమాలు బాగా లాభపడ్డాయి తప్ప, పేద తల్లులు పిల్లలని బడులకు పంపాలి అని చెప్పిన విషయం పూర్తిగా నీట కలిసింది. దానికి బదులు మనం ఒకసారి జనసేన మ్యానిఫెస్టోలో చూస్తే, ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత రవాణ సదుపాయం, విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లను ఏర్పాటు చేసిన నాణ్యమైన ఉచిత భోజనం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఏర్పాటు, విద్యార్థుల తెలివితేటలను బయటకు తీయడానికి ఇంక్యుబేషన్ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తాం. ఆ పదిహేను వేలల్లో ప్రతీ పైసా కేవలం విద్యకే, విద్యకు మాత్రమే ఉపయోగపడేది. నిజానికి విద్యార్థులకు కావాల్సింది ఉచితంగా ఇచ్చే పుస్తకాలు బ్యాగులు కాదు, అంత చదివాక దాని వల్ల సమకూరే ప్రయోజనాలు. పేదింటి విద్యార్థికి ఆర్థికంగా బలం చేకూరితే ఒక కుటుంబంతో పాటు, సమాజంలో BPL (Below poverty line) లో ఉండే ఒక కుటుంబం బయట పడినట్టు.
దీనికి తగట్టుగా జనసేన ఏది ఉచితం ఇవ్వాలో అది మాత్రమే ఉచితంగా ప్రకటించింది. మొన్న జరిగిన గ్రామ వాలంటీర్లు పరీక్షల్లో ఒక్కొక పరీక్షకి 300-400 రూ. ఫీజు గా తీసుకున్నారు.దీనిని కూడా జనసేన అన్ని పరీక్షలకు ఒకటే ఫీజు అని పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి CET ప్రక్రియలో భాగంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉంది,ఇదే కాకుండా జనసేన మ్యానిఫెస్టోలో ఉన్న చాలా అంశాలు నూతన విద్యా ప్రణాళిక లో పరిగణలోకి తీసుకున్నామని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పిన సంగతి విధితమే! వచ్చే ఏడాది నుంచి CET ప్రక్రియలో భాగంగా అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. ఇదే కాకుండా జనసేన మ్యానిఫెస్టోలో ఉన్న చాలా అంశాలు నూతన విద్యా ప్రణాళిక లో పరిగణలోకి తీసుకున్నామని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పిన సంగతి విధితమే!
ఇక అసలు విషయానికి వద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఇందులో కేవలం రెండు గదులు ఉంటాయి. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. కనీసం ఒక మూత్రశాల కూడా లేదు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధిస్తారు. ఇద్దరు మాష్టార్లు. ఉండే విద్యార్థులు సుమారు పది మంది. ఇప్పుడు ఇలాంటి పాఠశాలలు జిల్లాకి ఎన్ని ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఈ పాఠశాల ఉన్న ఊరు జనాభా సుమారుగా ఆరు వందల మంది. దురదృష్టవశాత్తు ఇలాంటి పాఠశాలలు జిల్లాకి చాలా ఉంటాయి. మండల, జిల్లా ఉన్నత పాఠశాలలు చాలా తక్కువ.నాడు నేడు కార్యక్రమం ఇలాంటి పాఠశాలల వరకు రాదు. పట్టణాలలో రోడ్డు పక్కన ఉన్న పాఠశాలలకు రంగులు వేయడంతో ఆగిపోతుంది.
అసలు బోధనే లేని ఇలాంటి పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఎంతవరకు చెప్పగలరు ఒకసారి ఆలోచించండి. అయినా చాలా మంది అనుభవజ్ఞులు, పరిశోధకులు మాతృ భాష విద్యార్థి ఎదుగుదలకు, సృజానత్మకతకు ఎలాంటి అడ్డు కాదనీ చెప్తూనే వస్తున్నారు,”నా శరీరం యొక్క లయ నా మాతృభాషతో సమానం. ఈ లయలోనే నేను పవిత్రతను కనుగొంటాను, విశ్వంలో ప్రతిచోటా ఉన్న నా తల్లి వద్దకు తిరిగి రాగలను. మీ పిల్లలు వారి మాతృభాష యొక్క మూలాధారాలలో సరిగ్గా చదువుకునేలా చూడండి, ఆపై వారిని ఉన్నత విద్యా విభాగాలకు వెళ్లనివ్వండి” అని నల్ల సూరీడు నెల్సన్ మండేలా చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం!! అంతర్జాతీయ ప్రమాణాలు అనే నెపం పెట్టుకుని రాజకీయాలు చెయ్యడం తప్ప ఇందులో ఎలాంటి సదుద్దేశమూ లేదు.పాఠశాలల్లో, అది కూడా నిన్నటి వరకు తెలుగులో బోధించే ఉపాధ్యాయులు చెప్పే ఆంగ్ల బోధన వల్ల విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకుంటారు అని నేనైతే అనుకోవడం లేదు.అంతర్జాతీయ ప్రమాణాలు అంటే కేవలం ఆంగ్లం కాదు కదా!! కలుపుగోరుతనం, నాయకులకు ఉండే లక్షణాలు ఇవన్నీ ఉండాలి. మనం చూసే ఏ అంతర్జాతీయ సంస్థ అయినా అది ప్రపంచ బ్యాంక్ కావచ్చు,UNO కావచ్చు CEO లను దేశ విదేశాల నుంచి ఎన్నుకుంటారు.వాళ్లందరినీ కేవలం ఆంగ్లం చూసే ఎంచుకోరు కదా,ఇక్కడ ఎవరూ ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదు,కానీ ఆ అవకాశం పూర్తిగా తల్లిదండ్రులకు విడిచిపెట్టాలి,అది పూర్తి స్వతంత్ర హక్కు,పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిర్మూలించి తల్లిదండ్రులకు వేరే అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం!! చూసే ఏ అంతర్జాతీయ సంస్థ అయినా అది ప్రపంచ బ్యాంక్ కావచ్చు, UNO కావచ్చు CEO లను దేశ విదేశాల నుంచి ఎన్నుకుంటారు.వాళ్లందరినీ కేవలం ఆంగ్లం చూసే ఎంచుకోరు కదా, ఇక్కడ ఎవరూ ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ అవకాశం పూర్తిగా తల్లిదండ్రులకు విడిచిపెట్టాలి. అది పూర్తి స్వతంత్ర హక్కు, పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిర్మూలించి తల్లిదండ్రులకు వేరే అవకాశం
లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం!!
                          ఇదంతా ఎందుకు అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన చే గువేరా UNO స్పీచ్ అతను తన మాతృ భాషలోనే ఇచ్చాడు.మన దేశం నుంచి UNO కి వెళ్ళిన చాలా మంది తమ తమ మాతృ భాషలోనే తమ తమ భావాలని వ్యక్త పరుచుకున్నారు! కేవలం ఆంగ్లంలో చదివితే అంతర్జాతీయ ప్రమాణాలు, ర్యాంకులు, ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటే GATE, IIT కోచింగులు ఎందుకో మరి వారే తెలియజేయాలి.ఇలా పదిమంది ఇరవై మంది విద్యార్థులు ఉండే పాఠశాలలకు విద్యా కానుక అని తమ స్వప్రయోజనాల కోసం పుస్తకాల పంపిణీ చేయడం ఎంత లాభం సమకూరుస్తుంది? ఆ పాఠశాలలో ఉండే ఇద్దరూ మాష్టార్లు పొద్దున్నే పాఠశాల తలుపులు తీసి అరుగు మీద కూర్చుని ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో కలిసి రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉన్న విద్యార్థులను స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ, ఇంటి పనులకు వినియోగించుకుంటూ వాళ్ల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. వాళ్లకి బుద్ధి బాగుంటే ఒక రెండు ముక్కలు చెప్తారు, లేకపోతే ముందే సెలవు ప్రకటించి వెళ్ళిపోతారు. గట్టిగా ఏదైనా అడిగితే కులాన్ని తీసుకొస్తారు!
                       ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టడం వల్ల పుస్తకాలు పంపిణీ చేయడం వల్ల అటెండెన్స్ పెరుగుతుందని చెబుతున్నారు. కానీ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, వసతులు లేకుండా, కనీసం మంచి బ్లాక్ బోర్డ్ లేకుండా, ఏ తల్లితండ్రులైన ఎలా చేరుస్తారు. ఇప్పుడు ఎంత పల్లెటూరైనా ఆ దగ్గరలో ఉండే చిన్న పట్నంలో ఖచ్చితంగా ఓ ప్రైవేట్ పాఠశాల ఉంటుంది. కష్టమో నష్టమో ఆ ప్రైవేటు పాఠశాలలో పిల్లల్ని చేర్చడానికి చూస్తారు తప్ప ఇలాంటి పాఠశాల పంపిస్తారా, కనీసం ఆ మాస్టార్ల చుట్టూ చేరి మాట్లాడే పెద్ద మనుషులు అయినా తమ పిల్లలను పాఠశాలల్లో చేరుస్తారు?? ఖచ్చితంగా చేర్పించారు. మరి ఈ ఆంగ్ల మాధ్యమం అని కోట్లు కోట్లు ఖర్చు పెట్టడంలో ఆంతర్యమేమిటి అనేది సగటు సామాన్యుడు గమనించాలి. పుస్తకాల పంపిణీ అని బ్యాగులు షూ, బెల్టులు అని కోట్లు కోట్లు ఖర్చు పెట్టడంలో ఆంతర్యమేమిటి అనేది సగటు సామాన్యుడు గమనించాలి.
                    మన రాష్ట్ర ఆర్థిక శాఖ కాగ్ నివేదిక ప్రకారం పన్నెండు నెలల్లో ఖర్చు పెట్టాల్సిన మొత్తం కేవలం ఏడు నెలల్లో ఖర్చు చేశారు. కేవలం విద్య కోసం అమ్మ ఒడి కోసం ఒక సంవత్సరానికి 6,500 కోట్లు ఖర్చు చేశారు. పుస్తకాలని బ్యాగులని షూ లని సంవత్సరానికి సుమారుగా 650 కోట్లు అధిక ఖర్చు. ఇవేవీ బడ్జెట్లో పేర్కొన్న ఖర్చు కాదు, అదనపు ఖర్చు. వేరే పథకం నుంచి ఇటు తర్జుమా చేసిన ఖర్చు, కేంద్ర ప్రభుత్వం సర్వ శిక్ష అభియాన్ కింద పేర్కొన్న మొత్తం 60% ఇటు మల్లించి జగన్నన్న విద్యా కానుక, వైఎస్సార్ కిట్లు అని సొంత డబ్బా వేసుకోవడంతో నిజంగా పేద పిల్లల మీద ప్రేమ లేక ఇంకేమైనా విషయం ఉందా అనేది తెలుస్తుంది. విద్యార్థుల మీద అంత ప్రేమ ఉంటే డిజిటల్ లైబ్రరీలు, వ్యాయామ మైదానాలు, విద్యార్థులకు జిజ్ఞాస కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. అంతే కానీ, అకౌంట్ లోకి డబ్బులు వేశాం రోజూ బడికి రండి అంటే ఎవరు వస్తారు ?
                         బోధించడం బాధించడం లా అనుకుని పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులు, కూర్చోవడానికి రాయడానికి సరైన సౌకర్యాలు లేని పాఠశాలలు, వర్షాలు గట్టిగా పడితే కారిపోయే పైకప్పు ఉన్న పాఠశాలలు, సరైన సైన్స్ ల్యాబ్ లు, శారీరిక శిక్షణ కోసం గ్రౌండ్లు లేని పాఠశాలల్లో పుస్తకాలు, షూలు, బ్యాగులు వాటి మీద మన రంగులు పక్కన అమాయకంగా ఒక చిరు నవ్వు ఉన్న ఫోటోలు ముఖ్యమా లేక ఏది ముఖ్యమో అనే అంశం ఎవరు ఎరుగకా కాదు! ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి బహుశా ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విద్యా వ్యాపారం, విద్యతో రాజకీయాలు చూస్తున్నాం. దేశం కోసం అహర్నిశలు పాటు పడే, మరణం పొందేవరకు దేశం కోసం విద్యార్థుల కోసం పాటు పడిన భారతరత్న అబ్దుల్ కలాం లాంటి వారి పేరు మీద ఉన్న పథకాలని పేరు మార్చి ముఖ్యమంత్రి అవ్వడానికి ఎంతో దోహద పడిన వైఎస్సార్ పేరు పెడతారు. విద్యార్థుల కోసం చేసే పని కాబట్టి, 60% నిధులు కేంద్రం ఇచ్చింది కనుక దేశ ఉద్దరానికి పాటు పడిన ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి పేర్లు పెట్టొచ్చు!! అయినా ప్రజాస్వామ్యం అని ప్రతీ పంద్రగాష్టుకి నోరు తిప్పలేని, సరిగా పలకలేని తెలుగులో స్పీచులు ఇచ్చేకంటే దానికి మూలమైన “ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కోసం” అనే మూల సిద్ధాంతాన్ని పెడచెవిని పెట్టి ప్రజలకి ధన ఆశ చూపించి జనాకర్షణ పథకాలతో అందలాన్ని అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి చూస్తే, ఆ వ్యక్తి లాభపడినా వ్యవస్థ మొత్తం కుప్పకూలి, మొదటి ఐదు స్థానాల్లో పోటీ పడిన రాష్ట్రం చివరి ఐదు స్థానాలకు పరిమితం అవుతుంది అని నాన్న మొహం చూసి కొడుకుకి మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు తెలుసుకునే వరకు….!!

BY
నిర్వాణ వాసుదేవ్
ట్విట్టర్ ఐడి : @nirvaana_7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
WhatsApp Image 2024-09-21 at 9.33
పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 100 రోజుల పరిపాలనపై విశ్లేషణ
20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way