బొబ్బిలి నియోజకవర్గంలో 22వ రోజుకు చేరుకున్న జనసేన – ప్రజా చైతన్య యాత్ర

       బొబ్బిలి, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ Dr. గిరాడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర IT వింగ్ సభ్యులు గేదుల సతీష్ జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం “అనే కార్యక్రమాన్ని 22వ రోజు బొబ్బిలి మండలం M బుర్జివలస, గొర్లె సీతారామపురం గ్రామాల్లో  ఇంటింటా ప్రచారం, మరియు ఉపాధి హామీ పథకం పనులును పరిశీలించడం జరిగింది. బొబ్బిలి జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ Dr.గిరాడ అప్పలస్వామి, జనసేన పార్టీ రాష్ట్ర IT వింగ్ సభ్యులు గేదుల సతీష్ సమక్షంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తూ, ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తు ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తిలో వినుతా కోటా ఆధ్వర్యంలో KNOW MY CONSTITUENCY కార్యక్రమం