కొత్తపల్లి, (జనస్వరం) : గత నాలుగు సంవత్సరాల నుండి కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు అడ్డాగా పేరుగాంచిన కొత్తపల్లి గ్రామం మరోసారి మందుకు వచ్చారు. ప్రజలకు సేవ చేయుటకు మేం ఎప్పుడు ముందు ఉంటాం అని నిరూపిస్తూ ఎండలు తీవ్రత రోజురోజుకి పెరుగుతుండడంతో కొత్తపల్లి యువత డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు తమ వంతు సాయంగా ప్రజల దాహం తీర్చుటకు కొత్తపల్లి సెంటర్ నందు “శ్రీ దాసాంజనేయ స్వామి వారి చలివేంద్రం” ప్రారంభించిన మొదటి రోజు సందర్బంగా ద్రాక్షా రసం పంపిణి చేసారు. అలానే వారంలో ప్రతి మంగళవారం మజ్జిగ పంపిణి చేస్తాము అని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.